28న కలెక్టరేట్ ముట్టడి


Thu,May 23, 2019 02:10 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : ఈ నెల 28న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ, సీపీఐ, సీపీఎం అనుబంధ కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. బుధవారం పట్టణంలోని యాదవ భవన సంఘం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 25న జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి 28న కలెక్టర్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...