మాతా శిశు మరణాలు తగ్గించాలి


Thu,May 23, 2019 02:10 AM

వనపర్తి వైద్యం: మాతా శిశు మరణాలు తగ్గించాలని ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సర్కారు దవాఖానను ఆకస్మికంగా పర్యవేక్షించాల్సి వచ్చిందని జాయింట్ డైరెక్టర్, కమిషనర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ విక్రం అన్నారు. ప్రభుత్వ దవాఖానకు వచ్చే గర్భిణులకు టీబీ, బీపీ, షుగర్, హెచ్‌ఐవీ ఉన్న, హిమోగ్లోబిన్ తక్కువ, బరువు తక్కువ, ఎక్కువ ఉన్నా హైరిస్క్‌గా గుర్తించి వారికి తగిన వైద్యం అందించాలని తెలిపారు. లేనిచో ఇలాంటివి మాతా శిశు మరణాలకు దారితీస్తాయని ఆయన జిల్లా దవాఖాన వైద్యులకు సూచించారు. వైద్యం అందించే సమయంలో వైద్యులు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అనంతరం గైనకాలజీ విభాగంలో గర్భిణుల నమోదు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ప్రసవానికి వచ్చినవారిని ఎందుకు రెఫర్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.

ఎక్కడికి పంపిస్తున్నారని గైనాకాలజీ డాక్టర్స్‌ను అడిగారు. అనెస్తటీసియా డాక్టర్ లేనందున మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానకు రెఫర్ చేస్తున్నామని వారు తెలిపారు. మరో మత్తు డాక్టర్‌ను అపాయింట్‌మెంట్ చేసుకోవాలని సూపరిండెంట్‌కు తెలియజేశారు,హైరిస్క్‌కేసులకు ఇబ్బంది ఔతుంది కాబట్టి త్వరగా మత్తు డాక్టర్‌ను అపాయింట్ చేసుకోవాలని కోరారు. అదేవిధంగా అశ కార్యకర్త గర్భిణి వెంట వస్తుందా లేదా గర్భిణిని 102 వాహనంలో జిల్లా దవాఖానకు తీసుకురావాలని, ట్రీట్‌మెంట్ చేయించుకున్న తర్వాత 102లోనే వదిలిపెట్టి రావాలని చెప్పారు. హైరిస్క్ కేసులైతే ప్రాథమిక వైద్యాధికారికి ముందుగా తెలియజేయాలని ఆయన సూచించారు. కేసీఆర్ కిట్ విభాగాన్ని సందర్శించి ఆన్‌లైన్ డాటాను పరిశీలించారు. ఆన్‌లైన్ నమోదు సరిగా చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు, జిల్లా వైద్యారోగ్యాధికారి కార్యాలయంలో ఉన్న డాటా ఎంట్రీ జాప్యం జరుగుతుందని త్వరగా చేయాలని తెలిపారు. వనపర్తి మాతా శిశు సంరక్షణశాఖ అధికారి డాక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ మాతా శిశు మరణాలు తగ్గాయని 2016లో 12 మంది మరణించారని 2017లో 13 మంది, 2018లో తొమ్మిది కేసులు నమోదయ్యాయని, 2019లో ఇప్పటివరకు మతా శిశు మరణాలు కాలేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ సురేశ్, ఆర్‌ఎంవో, చైతన్యగౌడ్, డీపీవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...