రైతు సర్వే @ 70 శాతం


Sun,May 19, 2019 02:26 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో రైతు సమగ్ర సర్వే కొనసాగుతుంది. ఏప్రిల్ నెలలో ప్రారంభమైన ఈ సర్వే మే నెల చివరిలోపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో జిల్లా వ్యవసాయ శాఖ ఉంది. దీంతో ఇప్పటి వరకు చేపట్టిన సర్వేలో 70 శాతం రైతులు వివరాలను నమోదు చేసుకున్నారు. జిల్లాలో లక్షా 36 వేల 483 మంది రైతులుండగా, ఇప్పటి వరకు 92748 మంది రైతుల వివరాలు సేకరించారు. ఈ నెలాఖరుకల్లా వంద శాతం సర్వే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ఆదేశించడంతో జిల్లా వ్యాప్తంగా అధికారులు, సిబ్బంది సర్వే పనులపై మరింత అప్రమత్తమయ్యారు. వ్యవసా య సాగులో విప్లవాత్మక మార్పులు తెచ్చి రైతులను అ న్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం పంటకాలనీల ఏర్పాటుకు శ్రీకారం చుడుతుంది. రైతులు సాగుచేస్తున్న పంటల వివరాలను సేకరించడం.. ప్రభుత్వం నుంచి పలు పథకాల ద్వారా లబ్ధిపొందడం, వ్యవసాయ భూ ములు, సాగునీటి వసతి తదితర అంశాలపై గ్రామాల్లో జిల్లా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖలు సంయుక్తంగా సమగ్ర సర్వే నిర్వహిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో ప్రారంభమైన ఈ సర్వే పలు ఎన్నికలు రావడంతో సర్వే పూర్తి కాలేదు. జిల్లాలోని గ్రామాల వారీగా ఏఈవోలు, హెచ్‌ఈవోలు, ఏవోలు రైతుల నుంచి అంశాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు.

లక్షా 36 వేల మంది రైతులు..
జిల్లాలో లక్షా 36 వేల 483 మంది రైతులున్నారు. వీరిలో 92748 మంది రైతుల నుంచి అధికారులు సమగ్ర సమాచారం సేకరించారు. ఇంకా 43908 మంది రైతుల సమాచారం సేకరించాల్సి ఉంది. జిల్లాలోని 65 మంది ఏఈవోలు, మరో 6 మంది హెచ్‌ఈవోలు, 12 మంది ఏవోలు సమాచార సేకరణలో పాల్గొంటున్నారు. ఏప్రిల్ నెలలో ప్రారంభం అయిన సర్వే పార్లమెంట్, పరిషత్ ఎన్నికలు రావడంతో వేగం పుంజుకోలేదు. మెజార్టీగా సర్వే అయినప్పటికి పూర్తి చేయాలంటే మరికొంత సమయం పట్టేలా కనిపిస్తుంది.

ఈనెల చివరికల్లా..
ఈ నెల చివరికల్లా సమగ్ర రైతు సర్వేను పూర్తి చేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటి కే సమాచార సేకరణలో కొంత ఆలస్యం జరిగిన సందర్భంలో ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి వేగంగా సర్వేను పూర్తి చేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇంకా పెండింగ్‌లో ఉన్న 43908 మంది రైతులతో సమాచారం సేకరించ గలిగితే నూటికి నూరు శాతం జిల్లాలో సర్వే పూర్తవుతుంది. అయితే, వీరిలో చాలా మంది రైతులు స్థానికంగా లేకపోవడం.. హైదరాబాద్‌తోపాటు మరికొన్ని ఇతర ప్రాం తాల్లో ఉంటున్నందునా సర్వే శాతం తక్కువగా నమోదవుతుంది. వీరంతా సర్వేలో పాల్గొంటేనే తప్పా వంద శాతం కావడం కష్టంగా ఉంటుంది. మిగిలిన రైతులందరికి సమాచారం ఇచ్చి ఈనెల చివరిలోపు సర్వేను ము గించాలనే ప్రయత్నంలో వ్యవసాయ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

70 శాతం నమోదు..
రైతు సమగ్ర సర్వే సేకరణ ఇప్పటి వరకు జిల్లాలో 70 శాతం నమోదైంది. జిల్లాలో 223 గ్రామాలుండగా, ప్రతి గ్రామానికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యా ప్తంగా 2,86,254 ఎకరాలు సాగవుతున్న అంచనా ఉం టే, రైతులు 1,36,483 మంది ఉన్నారు. వీరందరి నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించి నమోదు చేయా ల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఒకే రకం పంటలను రైతులంతా సాగు చేయకుండా నిరోధించడం.. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయించాలనే లక్ష్యంతోనే ఈసర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయా సీజన్‌లు.. పంటల అనుకూలతలను బట్టి వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సలహాలు.. సూచనలు ఇచ్చి పం టల సాగుబడులు చేయించాలనే లక్ష్యంను ప్రభుత్వం పెట్టుకుని సర్వే చేయిస్తుంది. 39 రకాల అంశాలపై వివరాలు సేకరిస్తుండగా, భూమి.. పంటలసాగు, విస్తీర్ణం వంటి అంశాలతోపాటు నీటి వసతి, బోరు, బావి, వర్షాదారం వంటి అంశాలను నమోదు చేస్తున్నారు. రైతులు సాగు చేసే పంటలు.. దిగుబడి ఎంత వస్తుంది.. గిట్టుబాటు అవుతుందా లేదా మార్కెట్ వసతి.. ఏ పంట వేస్తే లాభదాయకంగా ఉంటుందనే అంశాలను కూడా సేకరిస్తున్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...