పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి


Sun,May 19, 2019 02:26 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్వేతామొహంతి ఆదేశించారు. ఈ నెల 27వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్న దృష్ట్యా శనివారం వనపర్తిలోని పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను తనిఖీ చేశారు. బారికేడింగ్, మెష్, ఓట్ల లెక్కింపు చేపట్టనున్న టేబుళ్ల ఏర్పాటు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లెక్కింపు కేంద్రాల్లోకి ఇతరులెవరూ రాకుండా ఆవరణలో బారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బందితో పాటు ఏజెంట్లకు, అభ్యర్థులకు తాగునీరు, షామియానా వంటివి ఏర్పాటు చేయాలన్నారు. దీనంతటికీ ఎంపీడీవోలు పూర్తి భాద్యత తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని హాస్టల్ బ్లాక్‌లో శ్రీరంగాపూ ర్, పెబ్బేర్ మండలాల ఓట్ల లెక్కింపును చేపట్టనండగా, శిక్షణ హాల్‌లో గోపాల్‌పేట, రేవల్లి మండలాలు పక్కనే ఉన్న భవనంలో వనపర్తి ఆడిటోరియంలో ఖిల్లాఘణపురం మండలాల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నా రు. ప్రభుత్వ బాలుర ఉన్న త పాఠశాలలో కొత్తకోట, మదనాపురం, ఆత్మకూర్, అమరచింత మండలాలు, బాలుర జూనియర్ కళాశాలలో వీపనగండ్ల, చిన్నంబావి, బాలికల ఉన్నత పాఠశాలలో పాన్‌గల్, పెద్దమందడి మండలాల ఓట్ల లె క్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట జేసీ వే ణుగోపాల్, ఇన్‌చార్జి ఆర్డీవో వెంకటయ్య, డిప్యూటీ సీఈవో లైజన్ అధికారి నరసింహులు, డీపీవో రాజేశ్వ రి, సీఐ సూర్యనాయక్ తదితరులు ఉన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...