అకాల వర్షంతో తడిసిన వరిధాన్యం


Sun,May 19, 2019 02:25 AM

వీపనగండ్ల : మండలంలోని బొల్లారం, కొర్లకుంట, తూంకుంట తదితర గ్రామాలలో శనివారం సాయంత్రం బలంగా వీచిన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాలలో నిల్వచేసిన వరిధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆకస్మికంగా తెప్పచినుకులు రావడంతో తేమ శాతం కోసం ఆరబెట్టిన వరిధాన్యం కాపాడుకోవడానికి రైతులు పడరాని పాట్లుపడ్డారు. సాధారణంగా రాత్రివేళ్లలో కవర్లతో కప్పి భద్రపరచిన వరిధాన్యాన్ని తేమశాతం కాపాడుకోవడానికి ఉదయం పూట కప్పిన కవర్లను తొలగించి ఆరబెడుతారు. అకస్మికంగా సంభవించిన బలమైన వీదురు గాలితో కూడిన అకాల వర్షానికి ఆరుగాలం కష్టించి పండించిన వరిధాన్యం కాపాడుకోవడానికి రైతులు ప్రయత్నించినప్పటికీ జరగాల్సిన నష్టం జరగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్తాలు సకాలంలో అందకపోవడంతో ధాన్యం కొనుగోలు ఆలస్యమైనట్లు కొందరు రైతులు తెలిపారు. బొల్లారం గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద దాదాపుగా నాలుగు లారీలకు సంబంధించిన ధాన్యం నిల్వ ఉన్నట్లు రైతులు తెలిపారు. బొల్లారం గ్రామంలో అకాల వర్షం ప్రభావం ఎక్కువగా ఉండడంతో రైతులు రామాచారి, బాలస్వామి, తుప్పలయ్య, శంకరయ్య, మల్లేష్, గోపాల్, కృష్ణయ్య, బాలపీర్, మదన్ రెడ్డి, బక్కయ్య తదితర వందపైన రైతులకు సంబంధించిన వరిధాన్యం తడిసిపోయినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోని ధాన్యం కొనుగోలు వేగంగా జరిగేవిధంగా చూడాలని రైతులు కోరారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...