విజ్ఞానం.. వినోదం..


Sun,May 19, 2019 02:25 AM

వనపర్తి రూరల్ : విద్యార్థులలోని సృజన్మాకతను వెలికితీసేందుకు బీసీ గురుకుల సొసైటీ ప్రత్యేకంగా వేసవిలో విద్యార్థులు సెలువులను వృథా చేయకుండా వారిలోని ప్రతిభకు పదును పెట్టేందుకు విద్యతో పాటు క్రీడలలో నైపుణాన్ని పెంచేందుకు క్రీడా శిక్షణ, అలాగే నాట్యం, జర్నలిజం, ఫారెన్ ల్యాంగ్‌వేజ్, చర్చావేదిక, కరాటే, నేచర్ క్లబ్, మ్యూజిక్, డ్రామా ఫ్యాషన్ షో లాంటి కార్యక్రమాలలో వారికి ప్రత్యేకంగా తర్పీదు ఇచ్చేందుకు హైదరాబాద్ కార్మిక్ ఎడ్యూకేషన్ సొసైటీ ద్వారా యంగ్ లీడర్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని బీసీ 16 పాఠశాలల నుంచి 189 మంది విద్యార్థులకు 15 రోజులుగా వనపర్తి చిట్యాల మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలో ప్రత్యేక నిపుణులచే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీ గురుకుల పాఠశాల సొసైటీ ద్వారా రాష్ట్రంలోని బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులను వివిధ అంశాల వారిగా ఎంపిక చేసి వనపర్తిలోని బీసీ గురుకుల పాఠశాలలో ప్రత్యేక శిక్షణను అందించారు. రాష్ట్రంలోని బీసీ గురుకుల పాఠశాలలో ఉత్తమ వసతి, విద్యాబోధనను అందిస్తు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు గురుకుల పాఠశాలలు ఎంతో దోహదం చేస్తున్నాయి. విద్యార్థులను విద్యలోనే కాదు అన్ని విధాల తీర్చిదిద్దాలన్నా ప్రధాన ఉద్దేశ్యంతో బీసీ గురుకుల పాఠశాల సొసైటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని 142 పాఠశాలల నుంచి 189 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఈ వేసవిలో సెలువుల్లో ప్రత్యేక తరగుతుల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. 6 నుంచి 9 వ తరగతి వరకు చదివే విద్యార్థులకు శిక్షణను అందించారు.

8 రకాల అంశాలలో విద్యార్థులకు శిక్షణ..
బీసీ గురుకుల విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణాలచే నాట్యం, జర్నలిజం, ఫారెన్ ల్యాంగ్‌వేజ్, చర్చావేదిక, కరాటే, నేచర్ క్లబ్, మ్యూజిక్, డ్రామా ఫ్యాషన్ షో వంటి వాటిలో విద్యార్థులను తర్పీదు పొందేలా శిక్షణ ఇచ్చారు. ఇందుకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక కార్మిక్ ఎడ్యుకేషన్స్ సొసైటీ ద్వారా యంగ్ లీడర్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ద్వారా విద్యార్థులకు ప్రతి అంశంలోను విషయ పరిజ్ఞానం వచ్చేలా శిక్షకులు శిక్షణ అందించారు. ఉదయం 5:30 నుంచి 8:30 వరకు విద్యార్థులకు యోగా, శారీరక శిక్షణ ఇస్తు టీ, టీఫన్స్ తరువాత మిగతవాటిపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణను అందించారు. సాయంకాలం సమయంలో విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇచ్చారు. మ్యూజిక్ ఫ్లే చేయడంలో ఒక అంశంపై ఏ విధంగా చర్చిలో అనే అంశం పై చర్చావేదిక, ఇతర భాషలపై పట్టు సాధించేలా స్పొకెన్ ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించేలా, సమాజంలోని మార్పు కోసం కృషి చేసే జర్నలిజంపై విద్యార్థులకు ఆర్టికల్స్ రాసే విధానంపై శిక్షణ, ప్రకృతిలోని వనరులను మనం ఏవిధంగా కాపాడుకొవాలన్న విషయాలపై అవగాహన, డ్రామా, ఫ్యాషన్ షో వంటి, నాట్యం, వంటి వాటిలో విద్యార్థులకు అద్బుతమైన శిక్షణను దేశంలోని పలు ప్రాంతాల నుంచి 9 మంది శిక్షకులతో పాటు ఒక టీం లీడర్ విద్యార్థులకు తొమ్మిది అంశాలపై తర్పీదు అందించారు. ఈనెల 1న ప్రారంభమై ఈనెల 17 నాటికి ముగిసింది. వీటితో పాటు విద్యార్థుల అభిరుచిని, వారిలో దాగిఉన్న కళాత్మాక నైపుణ్యతను వెలికితీసేందుకు ఈశిబిరం ఎంతో దోహదం చేసింది. వివిధ అంశాలతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడమేకాక నృత్య శిక్షణ, బొమ్మల తయారీ, వేషాధారణ వంటి అంశాలలో తర్పీందు అందించారు. మొత్తానికి ఈ వేసవి సెలువులు తమ ఉజ్వల భవిష్యత్తుకు మంచి బాటలు వేసిందని విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...