ప్రారంభమైన పాలిసెట్ కౌన్సెలింగ్


Sun,May 19, 2019 02:25 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ/వనపర్తి విద్యావిభాగం: పాలిసెట్-2019 ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియను శనివారం ప్రారంభమైనంది. ఈ మేరకు ముందుగా విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరు అయ్యే అవకాశం తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మేరకు విద్యార్థులు శనివారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో 351 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు అయ్యారు. స్లాట్ బుక్ చేసుకునేందుకుగాను ఈనెల 19వ తేదీ చివరి తేదీగా ప్రకటించడం జరిగింది. ఈనెల 21వ తేదీ వరకు పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. పాలిసెట్ కౌన్సెలింగ్‌కు హాజరు అయ్యే విద్యార్థులు ఆదివారంలోపు మీసేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని పాలిటెక్నిక్ కళాశాల అసిస్టేంట కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. అలాగే వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో శనివారం పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈనెల 18 నుంచి 21 వరకు కౌన్సెలింగ్ కొనసాగుతుందని కళాశాల కన్వీనర్ తెలిపారు. విద్యార్థులు ఈ ఏడాది టైంశ్లాట్ విధానంలో విద్యార్థులకు అనువైన రోజు, అనువైన సమయంలో కౌన్సెలింగ్‌కు హాజరయ్యేవిధంగా నూతనంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. కౌన్సిలింగ్‌లో పాలిటెక్నిక్ బోధన సిబ్బంది, విద్యార్థుల తల్లిండ్రులు, విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు మొదటగా కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వెరిఫికేషన్, ధ్రువపత్రాల పరిశీలన, హెల్ప్‌లైన్ పద్ధతుల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...