కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలి


Sun,May 19, 2019 02:25 AM

స్టేషన్ మహబూబ్‌నగర్ : ప్రతి కళాశాలలో నూతన కోర్సులు ప్రవేశపెట్టాలని పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రాజరత్నం అన్నారు. శ్రీ చైతన్య డిగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో శనివారం స్థానిక సాయికృష్ణ ఫంక్షన్ హాల్‌లో విద్యార్థులకు డిగ్రీ ఆన్‌లైన్ తెలంగాణ(దోస్త్) ద్వారా డిగ్రీ కళాశాలలోకి ప్రవేశముపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రాజరత్నం ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీచైతన్య డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులను ప్రవేశపెట్టడం అభినందనీయం పేర్కొన్నారు. విద్యార్థులు కొత్త కోర్సుల వివరాలు తెలుకొని, వాటి వల్ల భవిష్యత్తులో ఎలాంటి లాభలు ఉంటాయే తెలుసుకోవలన్నారు. చదువుతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని, భాగ చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాక్షించారు. బీబీఏ కోర్సుకు పారిశ్రామిక రంగంలో ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ దోస్త్-2019 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 21వ శతాబ్దంలో సైన్స్ కోర్సులకు ఉన్న ప్రాముఖ్యత, ఎంసెట్ ర్యాంకులపై మనం ఆప్‌సెట్ ఎలా,, తరుణోపాయం ఏమిటి, దోస్త్ ద్వారా డిగ్రీ కాలేజీలలో ప్రవేశించడం ఎలా అనే అంశలపై విద్యార్థులకు వక్తలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ గౌరవఅధ్యక్షుడు రవికుమార్ పీసపాటి, ధన్యంతరి పౌండేషన్ ఇంటర్నేషనల్ మేనేజర్ వీ.ఎస్.రావు, విశ్రాంత ఆచార్యులు విశ్వనాథం, చైతన్య డిగ్రీ కళాశాల డైరక్టర్ డా.సీ.జీ శాస్త్రి, ఆచార్య కే.వీ. చలపతి, శ్రీ గురురాఘవేంద్ర విద్యాసమితి ఉపాధ్యాక్షులు టి.వెంకటరావు, శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...