దొంగతనం చేశారని..


Sat,May 18, 2019 05:52 AM

దేవరకద్ర, నమస్తే తెలంగాణ : చేయని తప్పుకు నింద వేయడంతో అవమానం భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన చిన్నచింతకుంట మండలం ముచ్చింతలలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుడు తెలపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన సురేందర్‌రెడ్డి కుమారుడు మహేశ్వర్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లి ఉద్యోగం చేస్తానని, దీంతో అక్కడికి వెళ్ల్లేందుకు ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను కోరగా వారు నిరాకరించారు. దీంతో బుధవారం ఇంటి వద్ద ఉన్న గేదెదూడను తీసుకొని దేవరకద్ర సంతలో విక్రయించేందుకు గ్రామంలోని తన మిత్రుడు రాజేందర్ సహాయంతో సంతలో విక్రయించగా వచ్చిన డబ్బులు కొంత ఖర్చు చేశాడు. దీంతో ఇంటి వద్ద గేదెదూడ కనిపించడం లేదని కుటుంబసభ్యులు గ్రామంలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తన కుమారుడు మహేశ్వర్‌రెడ్డిని నిలదీశారు. తన మిత్రుడు రాజేందర్‌రెడ్డి సహాయంతో దేవరకద్ర సంతలో విక్రయించానని తెలపడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం సర్పంచ్ హర్షిత, సర్పంచ్ భర్త మాజీ సర్పంచ్ హర్షవర్దన్‌రెడ్డి తదితర గ్రామ పెద్దలు కలిసి గ్రామపంచాయతీలో మహేశ్వర్‌రెడ్డి, రాజేందర్ చేసింది దొంగతనమని భవిష్యత్‌లో మరెవరు చేయకుండా ఉండాలంటే ఇద్దరికీ గుండు గియించి గ్రామంలో ఊరేగించాలని ఆదేశించారు. దీంతో రాజేందర్ తన తప్పులేదని మహేశ్వర్‌రెడ్డి వెంట వెళ్లానని తనకు ఎందుకు గుండు గీయిస్తారని వాగ్వాదానికి దిగాడు. అయినా గుండు గీయించడంతో అవమానం భరించలేక రాజేందర్ పురుగుల మందు డబ్బ తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడానికి గ్రామ సమీపంలోని వాగు వద్దకు వెళ్లడంతో గ్రహించిన గ్రామస్తులు వారించి గ్రామంలోకి తీసుకొచ్చారు. దీంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని బాధితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితుడు రాజేందర్ ఫిర్యాదు మేరకు సర్పంచ్, మాజీ సర్పంచ్ హర్షవర్దన్‌రెడ్డితోపాటు మరో పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు భూత్పూర్ సీఐ పాండురంగారెడ్డి తెలిపారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...