తాగునీటి అవసరాల కోసమే నీటి విడుదల


Sat,May 18, 2019 05:51 AM

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : కేవలం ఉమ్మడి జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసమే నీటి విడుదల జరిగినట్లు పీజేపీ డ్యాం డివిజన్ రెండో విభాగం ఈఈ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటరీ నుంచి ఎన్టీఆర్ కెనాల్‌కు నీటి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న గడ్డు పరిస్థితి నేపథ్యంలో సీఎం కేసీఆర్ కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి నీటి విడుదల చేయించారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని తాగునీటి పథకాలకు నీరు అందని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడి నీటిని సమకూర్చిందన్నారు. రామన్‌పాడ్ జలాశయం నుంచి కొనసాగుతున్న ఎన్నో తాగునీటి పథకాలకు ఈ సందర్భంగా నీరు సమకూర్చారన్నారు. 150 క్యూసెక్కుల చొప్పన నీటి విడుదల చేసిన క్రమంలో ఐదు రోజుల వరకు నీటి విడుదల కొనసాగనున్నాయి. తదుపరి రామన్‌పాడ్ నుంచి కొనసాగే తాగునీటి పథకాల ద్వార జిల్లా ప్రజలకు ఈ వేసవిలో తాగునీరు అందించగలమన్నారు. జిల్లా ప్రజల దాహర్తి తీర్చేందుకు రాష్ట్రం ప్రభుత్వం చేసిన ఈ కృషిని రైతులు అభినందించి సహకరించాలన్నారు. తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన నీటిని వ్యవసాయ పనులకు వినియోగించకూడదన్నారు. ఎవ్వరు కూడా మోటర్ల ద్వార నీటిని తోడరాదని సూచించారు. నీటిని వినియోగించిన పిదప మోటర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కాలువపై ఉన్న మోటర్లకు సంబంధించిన విద్యుత్ ఫ్యూజ్‌లను తొలగించేందుకు సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో ఏఈ వసంత, వర్క్ ఇన్‌స్పెక్టర్లు వెంకట్‌రెడ్డి, లక్ష్మయ్యగౌడ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...