స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత


Fri,May 17, 2019 03:11 AM

-పరిషత్‌ ఎన్నికల కార్య నిర్వాహణాధికారి మొగులప్ప
నాగర్‌కర్నూల్‌ రూరల్‌: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత, సీసీ కెమెరాల నిఘాలో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పరిషత్‌ ఎన్నికల కార్య నిర్వాహణాధికారి మొగులప్ప తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో మాట్లాడారు. జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించిన పరిషత్‌ ఎన్నికలు మొదటి విడతలో 7 మండలాల్లో ఈ నెల 6న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించామని, 69.89శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు. రెండో విడతలో ఐదు మండలాల్లో ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించగా 76.74 శాతం పోలింగ్‌ నమోదైందన్నారు. మూడో విడతలో 8 మండలాల్లో ఈ నెల 14వ తేదీన ఎన్నికలు జరిగాయని, 75.41శాతం పోలింగ్‌ నమోదైనట్లు పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో 20 మండలాల బ్యాలెట్‌ బాక్సులను భద్ర పర్చామన్నారు. పాలెంలోని వేంకటేశ్వర డిగ్రీ కళాశాల, నాగర్‌కర్నూల్‌లోని గీతాంజలి జూనియర్‌ కళాశాల, కల్వకుర్తిలోని సీబీఎం జూనియర్‌ అండ్‌ డిగ్రీ కళాశాల , జీఎస్‌ఎన్‌ జూనియర్‌ కళాశాల అచ్చంపేటలో కేటాయించిన మండలాలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను అధికారులు స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపర్చినట్లు తెలిపారు. పాలెంలోని వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నాగర్‌కర్నూల్‌, తిమ్మాజిపేట, తెలకపల్లి మూడు మండలాలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులు, జిల్లా కేంద్రంలోని గీతాంజలి జూనియర్‌ కళాశాలలో బిజినేపల్లి, పెద్దకొత్తపల్లి, కోడేరు, కొల్లాపూర్‌, పెంట్లవెల్లి, తాడూరు 6 మండలాలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులు భద్రపర్చినట్లు తెలిపారు.

సీబీఎం జూనియర్‌, డిగ్రీ కళాశాల కల్వకుర్తిలో వెల్దండ, ఊర్కొండ, కల్వకుర్తి, వంగూరు, చారకొండ మండలాలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులు భద్ర పర్చామన్నారు. జీఎస్‌ఎన్‌ జూనియర్‌ కళాశాల అచ్చంపేటలో అమ్రాబాద్‌, పదర, అచ్చంపేట, లింగాల, బల్మూరు, ఉప్పునుంతల మండలాలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులు భద్రపర్చామన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో బ్యాలెట్‌ బాక్సులు భద్ర పర్చిన ప్రదేశాల్లోనే మండలానికి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించిన బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు 27న ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద బారికేడ్లు, క్యాబిన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు పరిషత్‌ ఎన్నికల కార్య నిర్వాహణాధికారి మొగులప్ప తెలిపారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...