29 వరకు రైతు సమగ్ర సమాచార సేకరణకు గడువు


Fri,May 17, 2019 03:10 AM

నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యవసాయాధికారి సింగారెడ్డి వెల్లడి
కొల్లాపూర్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సమగ్ర సమాచార సేకరణకు గడువు ఈ నెల 29 వరకు పొడిగించిందని నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యవసాయాధికారి సింగారెడ్డి పేర్కొన్నారు. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలులో జిల్లా ఉద్యాన అధికారి చంద్రశేఖర్‌రావుతో కలిసి గ్రామంలో జరుగుతున్న రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వే ప్రక్రియను గురువారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ఇప్పటివరకు పెద్దకొత్తపల్లి మండలంలో రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వే 65శాతం చేయడం జరిగిందన్నారు. 35శాతం సర్వేను 29 వతేదీ వరకు పూర్తిచేసేందుకు చివరి గడువు ఉందన్నారు. గ్రామాల్లో లేని రైతులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించి సర్వేను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఉద్యోగులకు సూచించారు. అంతకుముందు ఫర్టిలైజర్‌ దుకాణాల్లో మందుల నిల్వల రిజిస్టర్లను పరిశీలించారు. వీరి వెంట కొల్లాపూర్‌, పెద్దకొత్తపల్లి మండలాల వ్యవసాయాధికారులు నాగరాజు, ఎండీ రజియాబేగం, ఏఈవో లతీఫ్‌ తదితరులు ఉన్నారు

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...