పట్టా చేసి.. ఆన్‌లైన్‌ మరిచి..!


Fri,May 17, 2019 03:10 AM

కోడేరు: తన పేర పట్టా ఉన్న భూమిని ఆన్‌లైన్‌ చేయాలని ఏడాదిగా ప్రజావాణిలో దరఖాస్తు చేస్తున్నా.. నేటికీ సమస్య పరిష్కరించడం లేదని మండలంలోని నర్సాయపల్లికి చెందిన మహిళా రైతు మహంకాళి మాధవి గురువారం ‘ధర్మగంట’ను ఆశ్రయించింది. కోడేరు మండలం నర్సాయపల్లి శివారులోని సర్వే నంబర్‌ 349లో తన తల్లి బాలమ్మ పేరున ఉన్న 2.9 ఎకరాల భూమిలో ఎకరా భూమిని 2015 జనవరి 23న రిజిష్ర్టేషన్‌ డాక్యుమెంటు నంబర్‌ 293/2015 పట్టా చేయించింది. అప్పట్లో అధికారులు పట్టాదారు పాసుబుక్కులు అందజేస్తు 1395 ఖాతా నంబర్‌ కూడా ఇచ్చారు. ప్రస్తుతం బాలమ్మ పేరున 349/అ1/2లో 1. 9 ఎకరాల భూమి మాత్రమే ఉంది. సర్వే నంబర్‌ 349/అ1/1, ఖాతా నంబర్‌ 1395 ఎకరా భూమి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన కొత్త పట్టాదారు పాసుబుక్కు, పెట్టుబడి సాయం నేటికీ రాలేదు. ఆన్‌లైన్‌లో నమోదు చేయనందున కొత్త పట్టాదారు పాసుబుక్కులు, రైతుబంధు చెక్కులు రాలేదని తెలిపింది. ఈ విషయమై ఏడాదిగా వీఆర్వో నారాయణ, తహసీల్దార్‌కు ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ప్రజావాణిలోనైనా దరఖాస్తు చేసుకుంటే త్వరగా సమస్య పరిష్కారం అవుతుందని ఏడాదిగా ఎన్నో దరఖాస్తులు ఇచ్చినా నేటికీ పరిష్కారం లభించలేదని బాధితురాలు వాపోయింది. కనీసం ధర్మగంట ద్వారానైనా తన సమస్యను పరిష్కరించాలని మహిళా రైతు కోరుతుంది.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...