‘నమస్తే’ చొరవతో తీరిన సమస్య


Fri,May 17, 2019 03:10 AM

మరికల్‌ : మండల కేంద్రానికి చెందిన జోగు సుశీలకు మరికల్‌ పరిధిలోని 688/ఆ సర్వే నంబర్‌లో 6.20 ఎకరాల భూమి ఉండగా, జోగు సవరప్ప పేరుపై 6.20 ఎకరాల భూమి ఉంది. సవరప్ప 2011 మరణించగా 2012లో విరాసత్‌ చేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటినుంచి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా విరాసత్‌ కాకపోవడంతో ‘నమస్తే తెలంగాణ’ ధర్మగంటను ఆశ్రయించింది. మరికల్‌ రెవెన్యూ అధికారులను ‘నమస్తే తెలంగాణ’ వివరాలు అడగగా వెంటనే విరాసత్‌కు సంబంధించి గతంలో దరఖాస్తు చేసుకున్న పంచనామా, ప్రొసీడింగ్‌ను రెవెన్యూ అధికారులు హుటాహుటిన ధరణిలో చేర్చి జోగు సుశీల సమస్యను పరిష్కరించారు. ఇప్పటివరకు జోగు సుశీలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం అందలేదని కొత్త పాసు పుస్తకం రాగానే అందజేస్తామని వీఆర్‌వో గోవర్ధన్‌చారి తెలిపారు. సవరప్పకు చెందిన 6.20 ఎకరాలు, జోగు సుశీలకు చెందిన 6.20 ఎకరాలు మొత్తం 13 ఎకరాల కొత్త పాసుబుక్కును అందిస్తామని తెలిపారు. నమస్తే చొరువతో సమస్య పరిష్కారం కావడంతో జోగు సుశీల ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...