డెంగీ నివారణకు కృషి చేయాలి


Fri,May 17, 2019 03:09 AM

-ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి
-నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాలి
-ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలి
-జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రవిశంకర్‌
వనపర్తి వైద్యం: డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రవిశంకర్‌ అన్నారు. గురువారం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్‌ కళాశాల మైదానం నుంచి అంబేద్కర్‌ చౌరస్తా, రాజీవ్‌ చౌరస్తా, ఇందిరాపార్క్‌ మీదుగా జిల్లా ఆస్పత్రి వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశకార్యకర్తలతో కలసి ర్యాలీ నిర్వహించారు. ముందుగా అయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ఏటా వర్షాకాలంలో వ్యాధి వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు. వనపర్తి జిల్లా పరిధిలోని కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లోని సమీప గ్రామాల్లో డెంగీ సీజనల్‌గా వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చాడాలని తెలిపారు. నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాలని సూచించారు. జిల్లా పరిధిలో 2017లో 25 డెంగీ కేసులు, 2018లో 24 కేసులు, 2019లో ఇప్పటివరకు 9 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు యాంటీలార్వా ఆపరేషన్‌ డెండీపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టడంవల్ల డెంగీ వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఇస్మాయిల్‌ , డాక్టర్‌ శంకర్‌, మలేరియా అధికారి శ్రీనివాస్‌, మద్దిలెట్టి తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...