రేపు కదిరేపాడ్‌ ఎంపీటీసీ స్థానానికి పోలింగ్‌


Thu,May 16, 2019 03:11 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : ఒక బ్యాలెట్‌ పేపర్‌కు బదులుగా మరొ బ్యాలెట్‌ పేపర్‌ను జారీ చేసిన కారణంగా పాన్‌గల్‌ మండలం కదిరేపాడ్‌ ఎంపీటీసీ స్థానానికి ఈనెల 17న పోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్వేతామొహంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 14న కదిరేపాడ్‌ ఎంపీటీసీ స్థానానికి నిర్వహించిన పోలింగ్‌ సందర్భంగా 64వ పోలింగ్‌ కేంద్రంలో కదిరేపాడ్‌ ఎంపీటీసీ బ్యాలెట్‌ పేపర్‌కు బదులుగా పెంచికలపాడ్‌ ఎంపీటీసీకి సంబంధించిన 87బ్యాలెట్‌ పేపర్లు జారీ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కలెక్టర్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లగా..

పూర్తిగా పరిశీలించి ఈనెల 17న కదిరేపాడు ఎంపీటీసీ స్థానానికి 64వ పోలింగ్‌ కేంద్రంలో కొత్తగా పోలింగ్‌ నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారి చేసిందన్నారు. దీంతో కదిరేపాడ్‌ ఎంపీటీసీ స్థానానికి ఈనెల 17న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కొత్తగా పోలింగ్‌ నిర్వహించడం జరుగుతుందని ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. పోలింగ్‌ సందర్భంగా ఓటర్లకు ఎడమ చేతి నాల్గో వేలుకు ఇండెలిబుల్‌ ఇంకును మార్కు చేయవలసిందిగా ఎన్నికల సంఘం ఆదేశించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...