పెండింగ్‌ ఖాతాలపై.. దృష్టి సారించాలి


Thu,May 16, 2019 03:10 AM

-కలెక్టర్‌ శ్వేతామొహంతి
- రెవెన్యూ అధికారులతో సమీక్ష
వనపర్తి, నమస్తే తెలంగాణ : భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పెండింగ్‌లో ఉన్న ఖాతాలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ శ్వేతామొహంతి రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో భూ రికార్డుల నవీకరణపై తహసీల్దార్లు, డీటీ, ధరణి కంప్యూటర్‌ ఆపరేటర్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ 7సీ, 10సీ,13సీ డ్యాకుమెంట్లపై దృష్టి నిలపాలని, తహసీల్దార్లు, డీటీలు, ఆర్డీవో, జేసీ తదితర స్థాయిలో పెండింగ్లో ఉన్న వాటిని క్లియర్‌ చేయాలని, ఆధార్‌ ఆలస్యంగా ఇచ్చిన ఖాతాలను క్లియర్‌ చేయాలని ఆదేశించారు. అంతేకాక సేత్వార్‌, పహానిల ఆధారంగా ఆర్‌ఎస్‌ఆర్‌ నివేదిక సరి చూసుకోవాలని ఎక్కడైనా 7సీ ఎక్కువగా పెండింగ్‌లో ఉన్న చోట సంబంధిత తహసీల్దార్లు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలన్నారు. నాలా, ఓఆర్‌సీ, కంపెని కేసులు, అలాగే ఇతర సమస్యలపై కూడా దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆయా మండలాల వారిగా పెండింగ్‌ ఖాతాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జేసీ వేణుగోపాల్‌, ఇన్‌చార్జి ఆర్డీవో వెంకటయ్య, తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...