పారిశుధ్య పనులను పరిశీలించిన కమిషనర్‌


Thu,May 16, 2019 03:07 AM

మక్తల్‌, నమసే ్తతెలంగాణ : పట్టణంలో మున్సిపల్‌ చేపట్టిన పారిశుధ్య పనులను మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం కేశవనగర్‌, మారుతికాలనీలో పర్యటించి పనులు దగ్గరుండి చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ మక్తల్‌ పురపాలికలో ప్రతి కాలనీ పరిశుభ్రంగా ఉండాలన్నదే తన లక్ష్యమని అం దులో భాగంగానే పారిశుధ్య పనులు చేపడు తున్నట్లు పేర్కొన్నారు.

ఉదయం సాయంత్రం పురపాలిక సిబ్బంది, కచ్చితంగా విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అలాగే వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుం టున్నామని, అయితే ప్రజలు కూడా నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రజలు తమ ఇంటి వద్ద మరుగుదొడ్డి నిర్మించుకొని స్వచ్ఛపట్టణంగా మార్చేందుకు సహకరించాలని కోరారు. కమిషనర్‌ వెంట మున్సిపల్‌ సిబ్బంది శంకర్‌తోపాటు మున్సిపల్‌ కార్మికులు ఉన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...