రేపటి నుంచి కొల్లూరు నర్సన్న తాత బ్రహ్మోత్సవాలు


Thu,May 16, 2019 03:05 AM

ఊట్కూర్‌ : మండలంలో ప్రసిద్ధి గాంచిన కొల్లూరు నర్సన్న తాత బ్రహోత్స వాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయి. వారం రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునే నర్సన్న తాత బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 17న సాయంత్రం, స్వామివారి ప్రభ, 18న రథోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ మేరకు ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. పూర్వం గొర్రెల కాపరిగా గ్రామానికి వచ్చిన నర్సన్నతాత తన ఆధ్యాత్మిక చింతనతో భక్తుల కోర్కెలను తీర్చేవాడని, ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన మాలిపటేల్‌ శంకర్‌రెడ్డి కుటుంబానికి సంతాన ప్రాప్తిని ప్రసాదించిన నర్సన్నతాత గ్రామ శివారులో గల వ్యవసాయ పొలంలో జీవ సమాధిని పొందాడనే చరిత్ర ఉంది.

నాటి నుంచి భక్తులు తమ కష్టాలను తొలగించే దైవంగా పూజిస్తు ప్రతి ఏటా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకలకు మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు హాజరై తీపి వంటకాలు, జొన్న అంబలితో నర్సన్న తాతకు నైవేద్యం సమర్పిస్తారు. ఈ జాతర సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...