ముగిసిన పరిషత్‌ ఎన్నికలు


Wed,May 15, 2019 03:11 AM

వీపనగండ్ల : మూడో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్పికల్లో భాగంగా మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహిస్తున్న ఎన్నికల ప్ర క్రియను కలెక్టర్‌ శ్వేతామొహంతి అకస్మికంగా సందర్శించి పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాలలో నిర్వహిస్తున్న ఎన్నికల విధానాన్ని ఆమె పరిశీలించారు. నిబంధనల మేరకు ఎన్నికలు సజావుగా సాగేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోలింగ్‌ శాతం తదితర అంశాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. వీపనగండ్ల మండలంలోని 8 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి చిన్నంబావి మండలంలోని 8 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లు ఎంపీడీ వో ఆంజనేయులు తెలిపారు. ఇందుకుగాను వీపనగం డ్ల మండలంలో 42 పోలింగ్‌ కేంద్రాలు, చిన్నంబావి మండలంలో 47 పోలింగ్‌ కేంద్రాలకుగాను మొత్తం 534 మంది ఎన్నికల సిబ్బంది ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోని జాగ్రత్తపడ్డారు. వీపనగండ్ల మండలంలో 5 రూట్లు, చిన్నంబావి మండల ంలో 6 రూట్లు ఏర్పాట్లు చేసి గట్టి బందోబస్తు నిర్వహించి ఎక్కడ కూడా పోలింగ్‌కు ఇబ్బంది కలగకుం డా చూసుకున్నారు. వీపనగండ్ల మండలంలో 22, 123 ఓటర్లకుగాను, 16,999 ఓటర్లు ఓటు హక్క వినియోగించుకోవడంతో 76.83 శాతం పోలింగ్‌ న మోదు కావడం జరిగిందన్నారు. అందులో పురుషు లు 8,711, స్త్రీలు 8,288 ఓటర్లు ఉన్నారు. అదేవిధం గా చిన్నంబావి మండలంలో 24,735 ఓటర్లకుగాను, 18,115 ఓటర్లు ఓటు హక్క వినియోగించుకోవడ ంతో 76.83 శాతం పోలింగ్‌ నమోదు కావడం జరిగిందన్నారు. అందులో పురుషులు 9,288, స్త్రీలు 8,827 ఓటర్లు ఉన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...