ప్రశాంతంగా మూడో విడత పోలింగ్‌


Wed,May 15, 2019 03:11 AM

పెబ్బేరు రూరల్‌ : పెబ్బేరు ఉమ్మడి మండలంలో మంగళవారం జరిగిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లో రెండు జెడ్పీటీసీ, 15 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పెబ్బేరు జెడ్పీటీసీకి నలుగురు, తొమ్మిది ఎంపీటీసీలకు 33 మంది, శ్రీరంగాపురం జెడ్పీటీసీ స్థానాలకు ముగ్గురు, 6 ఎంపీటీసీలకు 19 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఎన్నికల నిమిత్తం అధికారులు పెబ్బేరు మండలంలో 50, శ్రీరంగాపురం మండలంలో 28 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెబ్బేరు మండలంలో 9732 మంది పురుషులు, 9288 మంది మహిళలు, మొత్తం 19,020 మంది ఓటర్లు తమ ఓటు హ క్కును వినియోగించుకున్నారు. శ్రీరంగాపురం మండలంలో 5566 మంది పురుషులు, 5316 మంది మహిళలు, మొత్తం 10,882 మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. పెబ్బేరు మండలంలో 73.13 శాతం, శ్రీరంగాపు రం మండలంలో 72.36 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండు మండలాల్లోని అన్ని పోలి ంగ్‌ కేంద్రాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు ఓటర్లు బారులు తీరి ఓటు వేశారు. మధ్యాహ్నం నుంచి పోలింగ్‌ ముగిసే వరకు మందకోడిగా ఓటర్లు వచ్చారు. తీవ్ర ఎండల నేపథ్యంలోనే ఓటర్లు మధ్యాహ్నం లోపే ఓటేసి వెళ్లిపోయారు. అలాగే, పలు గ్రామాల్లో పట్నం వెళ్లిన వలుస ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక గ్రామాల్లో ఎక్కువ నిఘా పెట్టారు. పాతపల్లి గ్రామంలో ఆశమ్మ అనే యువతి పెళ్లి బుధవారం జరుగనుండగా, పెళ్లి అనంతరం కూతురు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంది. కాగా, ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరగడం పట్ల ఎంపీడీవో సుజాత, ఎస్‌ఐ విజయకుమార్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...