ప్రచారానికి సై..


Fri,April 26, 2019 01:49 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : పరిషత్ ఎన్నికల ప్రక్రియలో తొలిఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పల్లెల్లో ప్రచారాలు పరుగులందుకోబోతున్నా యి. అభ్యర్థుల ఎంపికలు, బీఫాంల పంపిణీలాంటివన్ని కొలిక్కి రావడంతో ఇక గ్రామాల్లో మైకుల మోతలు మళ్లీ మొదలు కానున్నాయి. జిల్లాలో తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న వనపర్తి, రేవళ్లి, గోపాల్‌పేట, ఖిల్లాఘణపురం మండలాల్లో ప్రచారాలకు ఆయా పార్టీల నాయకులంతా దృష్టి పెడుతున్నారు. ఎంపీటీసీ స్థానాల్లో కొన్ని ఏకగ్రీవాలు అయ్యే అవకాశాలున్నాయి. జిల్లాలో మే 6న తొలి విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ వనపర్తి, ఖిల్లాఘణపురం, రేవళ్లి, గోపాల్‌పేట మండలాల్లో జరుగబోతోం ది. ఈ మండలాల్లోని గ్రామాలకు సంబంధించిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇటీవలే ముగిసింది. మొత్తం నాలుగు మండలాల్లో 40 ఎంపీటీసీ స్థానాలకు 206 మంది, నాలుగు జెడ్పీటీసీ స్థానాలకు 25 మంది నామినేషన్లు దాఖలు చేసిన సంగతి విధితమే. మూడు రోజుల పాటు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చిన క్రమం లో తొలివిడత పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 28 వరకు ఉపసంహరణ గడువుండగా, మే 6న ఎన్నికల పోలింగ్‌ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

తీవ్రమైన పోటీ..
తొలి విడతలో 40 ఎంపీటీసీ స్థానాలుంటే 239 మంది అభ్యర్థులు పోటీ చేశారు. జెడ్పీటీసీ స్థానాలు నాలుగుంటే 36 మంది వివిధ పార్టీల నుంచి నామినేషన్లు వేశారు. స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎక్కువ నామినేషన్లు దాఖలు కాగా, తమకే బీఫాం వస్తుందంటూ మరికొంత మంది కూడా నామినేషన్లు వేసుకున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పార్టీ బీఫాంను అభ్యర్థులకు అందించేలా చర్యలు తీసుకున్న క్రమంలో ఉపసంహరణ గడువులోపు ఒకేపార్టీకి చెందిన ఇతర సభ్యులను నామినేషన్ల ప్రక్రియ నుంచి ఉపసంహరణ చేసే దిశగా కార్యచరణ మొదలైంది. ప్రతిపక్ష పార్టీల నుంచి నామినేషన్లు వేసినా చివరకు ఏదో ఒక్క పార్టీ నుంచి అభ్యర్థిని పోటీ చేయించాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రచారాలపైకి దృష్టి..
పార్టీ బీఫాంలు ఇప్పటికే కొందరికి చేరడంతో ఇక వార ంత ప్రచారాల వైపు దృష్టి పెడుతున్నారు. మరికొన్ని చో ట్ల ఒకేపార్టీ నుంచి ఒకరిద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేసిన చోట ఉపసంహరణ గడువు వరకు వేచి చూస్తున్నారు. ఎలాంటి గందరగోళం లేని గ్రామాల్లో వ్యూహ.. ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. మెజార్టీ గామా ల్లో అభ్యర్థుల నిర్ణయాలపై స్పష్టత ఉండగా, గ్రామాల్లోనే అభ్యర్థుల ఎంపికలో అస్పష్టతగా ఉన్నాయి. ఎలాంటి సమస్యలేని గ్రామాల్లో మాత్రం ప్రచారాల అలికిడి మొదలైంది. ప్రచారాలకు తక్కువ సమయం ఉంటున్నందునా ఓటరును కలుస్తూ ప్రచారం చేసుకుంటున్నారు.

ఏకగ్రీవాల కోసం యత్నం..
తొలి విడతలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీ సీ స్థానాల నుంచి పలుచోట్ల ఏకగ్రీవాలయ్యే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి. తండాలు, చిన్న గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలు అయ్యేందుకు ఎక్కువ వీలుంది. ఇప్పటికే వాటిపై గ్రామాల్లో చర్చలు మొదలయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అనేక చోట్ల కొత్తగా వెలసిన పంచాయతీలు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిషత్ ఎన్నికల్లోనూ ఏకగ్రీవం చేసుకుంటే.. గ్రామాలు ప్రశాంతంగా ఉండటం, అభివృద్ధికి బాటలు వేసుకున్నట్లుగా నిలుస్తుంది. ఉపసంహరణకు గడువున్నందునా ఈలోపు పలు గ్రామాల్లో చర్చలు నిర్వహించుకుని ఐక్యమత్యానికి చిహ్నంగా నిలిచేలా పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

సమన్వయం చేస్తున్న మంత్రి సింగిరెడ్డి ..
పరిషత్ ఎన్నికలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమన్వయం చేస్తున్నారు. పరిషత్ ఎన్నికలకు వనపర్తి జిల్లాతోపాటు గద్వాల జిల్లా ఇన్‌చార్జిగా మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని మండలాలు, గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో పార్టీ బీఫాంల కోసం గట్టి పోటీ ఉన్న ప్రాంతాలపైన అభ్యర్థుల మధ్య సమన్వయం చేసి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిషత్ ఎన్నికల్లోను గులాబీ పార్టీ విజయఢంకా మోగిస్తుందన్న సాంకేతాలతో పార్టీ టికెట్ల కోసం ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్నారు. వీరందరిని ఏకతాటిపైకి తెచ్చి పరిషత్ ఎన్నికల్లో మరొక్కసారి టీఆర్‌ఎస్ విజయబావుటా ఎగరవేసేందుకు మంత్రి సింగిరెడ్డి అన్ని చర్యలను తీసుకుంటున్నారు. రెండు,మూడు రోజులుగా వనపర్తిలోనే మకాం వేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి అభ్యర్థులకు బీఫాంలను అందించడం, ఎక్కువ మంది నామినేషన్లు వేసిన చోట సమన్వయం చేసే పనులకు శ్రీకారం చుట్టారు. ప్రతిపక్ష పార్టీల నుంచి పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడం నామమాత్రంగా కనిపిస్తుంది.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...