ఉమ్మడి జిల్లాలో ఐదు జెడ్పీటీసీ స్థానాలు టీఆర్‌ఎస్‌వే


Fri,April 26, 2019 01:46 AM

వనపర్తి రూరల్ : ఉమ్మడి జిల్లాలోని ఐదు జెడ్పీటీసీ చైర్మన్‌లు టీఆర్‌ఎస్ అభ్యర్థులేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం మంత్రి నివాసంలో అడ్డాకల్ మండలం పెద్దమునగల్ చేడ్ గ్రామానికి చెందిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పరిషత్ ఎన్నికలలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పరిషత్ ఎన్నికలలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని తెలిపారు. ఐదేళ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన కార్యక్రమాలను చూసి గత అసెంబ్లీ, లోక్‌సభ, గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు బ్రహ్మారథం పట్టారన్నారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీలో చేరిన వారిలో వైస్ ఎంపీపీ ఆంజనేయులు, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ యూత్ నాయకులు హజ్రత్‌బాబు, రఘువర్ధన్ రెడ్డి, రాజు, చెన్నయ్య, రాఘవేంద్రర్ సాగర్, వెంకట్రాములు, నాగరాజు, ఆంజనేయులు, నవీన్, రాములు, వెంకటేష్, కృష్ణ, మన్యం పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...