మలి విడతకు శ్రీకారం..


Fri,April 26, 2019 01:45 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ప్రాదేశిక ఎన్నికల తొలి విడత నామినేషన్ల పర్వం బుధవారంతో ము గిసింది. రెండ్రోజులకే శుక్రవారం నుంచి రెండో విడత ప్రారం భం కానున్నది. మొత్తం మూడు విడతల ప్రాదేశిక ఎన్నికల స మరానికి సంబంధించి షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం వి డుదల చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో (5 జిల్లాల పరిధిలో) మొత్తం 790 ఎంపీటీసీ స్థానాలుండగా రెం డో విడతలో 287 ఎంపీటీసీలకు, 5 జిల్లాల పరిధిలో 71 జెడ్పీటీసీలు ఉండగా 26 జెడ్పీటీసీలకు మే 10న పోలింగ్ జరగనున్నది. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రమే మొదటి, రెండో విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నాగర్‌కర్నూలు, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలలో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా మొత్తం 790 ఎంపీటీసీలు, 71 జెడ్పీటీసీలకు మూడు విడతల్లో పోలింగ్ పూర్తవుతుంది. మే 27న కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలు వెలువడతాయి. జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.లక్షా 50 వేలు గరిష్ఠ వ్యయ పరిమితి విధించారు.

రెండో విడత పోరు వివరాలు
ఉమ్మడి పాలమూరు పరిధిలోని 5 జిల్లాల్లో రెండో విడతలో 287 ఎంపీటీసీ, 26 జెడ్పీటీసీలకు పోలింగ్ జరగనున్నది. మహబూబ్‌నగర్ పరిధిలో 91 ఎంపీటీసీ, 7 జెడ్పీటీసీ, నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో 52 ఎంపీటీసీ, 5 జెడ్పీటీసీ, జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 47 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ, వనపర్తి జిల్లా పరిధిలో 43 ఎంపీటీసీ, 5 జెడ్పీటీసీ, నారాయణపేట జిల్లా పరిధిలో 54 ఎంపీటీసీ, 5 జెడ్పీటీసీలకు పోలింగ్ జరగనున్నది. శుక్రవారం నుంచి 28వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. 29వ తేదీన నామినేషన్ల స్క్రూట్నీ, 30న నామినేషన్ల తిరస్కరణపై అప్పీలు, మే 2న సాయంత్రం 3 గంటల వరకు అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. మే 2 సాయంత్రం 3 గంటల తర్వాత అధికారంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారి విడుదల చేస్తారు. మే నెల 10వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఒక వేళ ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే (రీపోలింగ్) ఎప్పుడు నిర్వహించాలో ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. మే నెల 27న కౌంటింగ్ చేసి ఫలితాలను వెల్లడించనున్నారు.

కార్యకర్తలతో రోజంతా గడిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ప్రాదేశిక ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు నేతలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీలో టిక్కెట్ల కోసం గతంలో ఎప్పుడూ లేనంతగా పోటీ నెలకొన్నది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ టిక్కెట్లను ఎలాగైనా కైవసం చేసుకునాలని నేతలు పోటీ పడుతున్నారు. ప్రతిపక్షాలు ప్రాదేశిక సమరంలోనైనా ఉనికి చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కోవడం ప్రతిపక్షాలకు కష్టసాధ్యమైన వ్యవహారంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే టీఆర్‌ఎస్ టిక్కెట్లకు ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది. కారు గుర్తుపై పోటీ చేస్తే చాలు గెలుపు తథ్యం అనే మాట అభ్యర్థుల్లో ప్రతిధ్వనిస్తోంది. అందుకే ఎలాగైనా కారు గుర్తును కైవసం చేసుకుని బరిలో నిలవాలని ఆశిస్తున్నారు. గురువారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు నేతలు, కార్యకర్తలతో చర్చలు జరిపారు. గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇచ్చే విషయమై అందరితో చర్చించారు. పార్టీలో కష్టపడుతున్న వారికి, ప్రజల్లో మంచి పేరు ఉన్న వారికే టిక్కెట్లు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. పలు చోట్ల పోటీ ఎక్కువగా ఉండటంతో టిక్కెట్ల హామీ లభించిన నేతలను బుజ్జగించారు. పార్టీ నిర్ణయించిన మేరకు పనిచేయాలని వారికి హితవు పలికారు. మహబూబ్‌నగర్ రూరల్, హన్వాడ మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ టిక్కెట్ల కేటాయింపు మంత్రి పూర్తి చేశారు. భారీగా పోటీ నెలకొని ఉండటంతో నిరాశకు గురైన వారిని సముదాయించారు. పార్టీకి విధేయంగా ఉన్న వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని వారికి నచ్చజెప్పారు. పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి గులాబీ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

జోగుళాంబ గద్వాల జిల్లా
రెండో విడత (4 మండలాలు) : అయిజ, మల్దకల్, రాజోళి, వడ్డేపల్లి (47 ఎంపీటీసీలు)

నాగర్‌కర్నూల్ జిల్లా :
రెండో విడత (5 మండలాలు) : కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, తెల్కపల్లి, తాడూరు (52 ఎంపీటీసీలు)

వనపర్తి జిల్లా :
రెండో విడత (5 మండలాలు) : అమరచింత, ఆత్మకూరు, కొత్తకోట, మదనాపూర్, పెద్దమందడి (43 ఎంపీటీసీలు)

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...