ముగిసిన తొలి ఘట్టం..!


Thu,April 25, 2019 03:50 AM

మహబూబ్‌నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : తొలి దశ ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి తెర పడింది. ఉమ్మడి మహబూబ్ నగర్ పరిధిలోని 5 జిల్లాల్లో తొలి విడతలో మొత్తం 294 ఎంపీటీసీ స్థానాలు, 24 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జెడ్పీటీసీ స్థానాల కోసం 244 నామినేషన్లు దాఖలు కాగా... ఎంపీటీసీ స్థానాలకు 1905 నామినేషన్లు పడ్డాయి. అత్యధికంగా జెడ్పీటీసీ స్థానాల కోసం మహబూబ్ నగర్ జిల్లాలో 83 నామినేషన్లు వచ్చాయి. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 727 నామినేషన్లు వచ్చాయి. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని పెంట్లవల్లి, పెద్దకొత్తపల్లి మండలాల్లో నిర్ణీత గడువు లోపలే రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్న అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చి నామినేషన్లను స్వీకరించారు. ఈ మండలాల్లో రాత్రి 9 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం విశేషం.

నాలుగు జెడ్పీ అభ్యర్థిత్వాలపై కొనసాగుతున్న ఉత్కంఠ..
మహబూబ్ నగర్ జెడ్పీ చైర్మన్ స్థానానికి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం ముందుగానే ప్రకటించింది. అయితే మిగతా 4 జెడ్పీలకు మాత్రం చైర్మన్ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కొందరిని జెడ్పీ చైర్మన్ అభ్యర్థులుగా ప్రకటిస్తే ఎలా ఉంటుందనే అంశంపై ఇప్పటికే పార్టీ ముఖ్యుల అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. జెడ్పీ అభ్యర్థిత్వాలపై ఓ స్పష్టత వచ్చిందని రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా తమ జెడ్పీ అభ్యర్థుల విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతూ వస్తున్న ప్రతిపక్షాలకు ఈ ఎన్నికల్లో కనీసం అభ్యర్థులు దొరకక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...