బైక్ అడిగితే ఇవ్వలేదని..


Thu,April 25, 2019 03:49 AM

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : తాను బయటికి వెళ్లి రావడానికి మోటర్ బైక్ అడిగితే ఇవ్వలేదన్న కోపంతో సొంత అన్న పెద్దరాజును తమ్ము డు చిన్నరాజు హతమార్చాడని డీఎస్పీ సృజన తెలిపారు. బుధవారం మండల కేంద్రం అమరచింత పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. హత్య జరిగిన ఒకే రోజులో నిందితున్ని పట్టుకున్న నేపథ్యంలో నిందితున్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఉమ్మడి కు టుంబంలో సొంత బైకు కొనేందుకు అన్నకు తెలియకుండా 30 గొర్లను అమ్మినప్పుడు గ్రామంలో పెద్ద మను షుల ముందు అవమానానికి గురిచే శాడని, ఆస్తి పంపకంలో అన్యాయం జరిగిందని, జీతగాడి విషయంలోనూ తనకు అన్యాయం జరిగిందని సొంత అన్నపై కోపం పెంచుకున్న చిన్నరాజు, అన్న బతికి ఉంటే తనను ఎప్పుడూ ఇలాగే కట్టడిచేస్తాడన్న భయంతో అన్నను చంపేందుకు నిర్ణయించు కున్నాడని పేర్కొన్నారు. మూడ్రోజు లుగా అదునుకోసం చూసిన చిన్న రాజు సోమవారం ఉదయం ఇంట్లో నిద్ర పోతుండగా రోకలిబండతో తలపై మోది దారుణంగా హత్య చేశాడని తెలిపారు. మంగళవారం కొంకనివానిపల్లి గ్రామ శివారులో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎస్‌ఐ రామస్వామి తమ సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసు కున్నట్లు చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి సీఐ వెంక టేశ్వర్‌రావు, ఎస్‌ఐ రామస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...