ప్రజల మనసు గెలవండి


Wed,April 24, 2019 03:19 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో టీఆర్‌ఎస్ తరుపున ఫోటీ చేసే అభ్యర్థులు ప్రజల మనసును గెలిచి విజేతలుగా తిరిగిరావాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దశా నిర్దేశం చేశారు. మంగళవారం తొలివిడలో పోటీ జరుగనున్న వనపర్తి, గోపాల్‌పేట, ఖిల్లాఘనపురం, రేవల్లి మండలాలలో పోటీ చేయనున్న అభ్యర్థులు, ఆయా గ్రామాల నేతలతో వనపర్తిలోని స్వగృహంలో సమావేశమై బీఫాంలను మంత్రి నిరంజన్ రెడ్డి అందజేశారు. అభ్యర్థులు గెలిస్తే గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తామో ప్రజలకు తెలియజెప్పడంతో పాటు, ఐదేళ్ల కాలంలో టీఆర్‌ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించాలన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వట్టి పోయిందని, సీఎం కేసీఆర్ దూరదృష్టి, తెలంగాణలోని సమస్యల పట్ల ఉద్యమకాలం నుంచి ఉన్న అవగాహన మూలంగా తెలంగాణ సాధించిన వెంటనే అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కొత్త వరవడిని సృష్టించి ప్రపంచ చూపును తన వైపునకు తిప్పుకున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజల కోణం నుంచి ఆలోచించే పాలకుడు ఉండడం మూలంగానే ఒక కల్యాణలక్ష్మి, ఓ రైతుబందు, రైతుబీమా, వంటి తదితర పథకాలు, విద్యార్థులకు సన్నబియ్యం, నూతనంగా 560 గురుకులాలు వంటి మార్పులు, ఓ మిషన్ భగీరథ, ఓ మిషన్ కాకతీయ, కాలేశ్వరం, పాలమూర్ రంగారెడ్డి వంటి ప్రాజెక్టులు వచ్చాయన్నారు.

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీళ్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఇదంతా సీఎం కేసీఆర్ నాయకత్వం మూలంగనే సాధ్యమైందని మంత్రి తెలిపారు. దశాబ్దాలు పాలించిన పార్టీలు ప్రజలకు కనీసం కరెంటు, సాగునీరును అందించలేకపోయాయని, అయిదేళ్ల పాలనలో వినూత్న పథకాలతో దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా సీఎం కేసీఆర్ పాలన నిలిచిందన్నారు. ప్రజలు అందరికన్నా గొప్పవారని, చైతన్యవంతులని, గత సమైక్య పాలనలో కరెంటు, సాగునీళ్లు లేక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం? బతుకుదెరువు లేక ఎక్కడెక్కడికి వలసలు పోయాం? ప్రసుత్తం ఐదేళ్లలో ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా ఎలా బాగుపడ్డాం అన్నది వారికి తెలుసునని పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రభుత్వం చేసిన పనులను ప్రజల దృష్టికి తీసుకెళ్తే చాలని మంత్రి అభ్యర్థులకు సూచించారు. శాసనసభ, సర్పంచ్ ఎన్నికల ఫలితాలే స్థానిక పరిషత్ ఎన్నికలలో పునరావృత్తం అవుతాయని, ప్రజలతో కలిసిపోయి వారి అవసరాలు, గ్రామాలలో సమస్యలను గుర్తించి వారికి భరోసా ఇవ్వడమే అభ్యర్థుల ప్రధాన కర్తవ్యం అని మంత్రి సూచించారు. ప్రజలు స్థానిక ఎన్నికలలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...