ఆత్మవిశ్వాసంతో..ముందడుగేయాలి


Wed,April 24, 2019 03:17 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న కానిస్టేబుల్ ఉద్యోగాలలో భాగంగా చివ రి దశ రాత పరీక్షలకు సిద్ధమవుతున్న ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు వనపర్తి జిల్లా పోలీస్‌శాఖ ఆ ధ్వర్యంలో నిర్వహించిన కానిస్టేబుల్ మాదిరి పరీక్ష విజయవంతంగా పూర్తి అయ్యిందని ఎస్పీ అపూర్వరావు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ జూనియర్ కళాశాల, ప్ర భుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధం అవుతున్న అభ్యర్థులలో 364 మం ది అభ్యర్థులు మాదిరి కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యారు. ఎస్పీ అపూర్వరావు స్వయంగా పరీక్ష కేంద్రాలకు వెళ్లి అభ్యర్థులను వివరాలతో పాటు ప్రశ్నాపత్రం గురించి అడిగి తె లుసుకున్నారు. మాదిరి పరీక్షలలో పాల్గొన్న 364 మంది అభ్యర్థులలో మొదటి స్థానం లో పెబ్బేర్ మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన దాసునాయుడు, వీపనగండ్ల మండ లం పుల్గర్‌చర్ల గ్రామానికి చెందిన రాజేందర్‌గౌడ్, వనపర్తికి చెందిని హారిక మూడో స్థానంలో విజేతలుగా నిలవడంతో వీరిని జిల్లా కేంద్రంలో ని ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరం లో ఎస్పీ అపూర్వరావు అభినందించారు. అంత కు ముందు ఎస్పీ అపూర్వరావు అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మాదిరి పోటీ పరీక్షలలో మొదటి, రెండో, మూడో స్థానాల కోసం అందరు పోటీ పడ్డారని ఇదే ఉత్సాహంతో అధికారికంగా జరిగే పరీక్షలలో తమ సత్తాను చాటి అందరికి ఆదర్శంగా నిలివాలన్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెం పొందించుకుని మనోధైర్యంగా ముందుకు సాగాలని ఎస్పీ అభ్యర్థులకు సూచించారు. అదేవిధం గా పరీక్షలు సమీపిస్తున్న కొద్ది అధైర్యానికి లోనుకాకుండా ఏకాగ్రతతో చదివి విజయం దిశగా ముందుకు సాగాలని అనుభవజ్ఞులతో ఆలోచనాపరంగా ఏమైనా సలహాలు, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకొని పరీక్షలో పాల్గొన్ని విజయం సాధించాలని ఎస్పీ అభ్యర్థులను కోరారు. అనంతరం ఉచిత కానిస్టేబుల్ శిక్షణ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భాస్కర్, చెన్నరాములు, నరసింహ, చంద్రశేఖర్, లను శాలువా, పూలమాలలతో సత్కరించి, ఈ కార్యక్రమం కోసం ఎంతో శ్రమించి నిర్వహిస్తున్న ఎస్పీ పీఆర్‌వో రాజాగౌడ్, కానిస్టేబుల్ గౌస్ పాష, ఏఎస్‌ఐ అహ్మద్‌హుస్సెన్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...