పంట పండింది..!


Tue,April 23, 2019 12:43 AM

మూసాపేట : ఏళ్ల తరబడి కరువు కాటకాలతో సతమతమైన రైతన్నలకు ఈ యేడు యాసంగిలో కూడా రైతన్నలకు పంట పండింది. గతంలో వేసిన పంటలకు సాగునీరు అందించకపోవడంతో ఆశించిన స్థా యిలో దిగుబడి వచ్చేది కాదు. దీంతో రైతులకు ప్రతి యేట పెట్టుబడి సైతం మీదపడేది. ప్రతియేట ఎంతో కొంత అప్పు పెరుగుతూ వచ్చేంది. కానీ మూడు దశాబ్ధాల తార్వత దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చొరవతో పెద్దవాగు గుండా ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను మూ డు నెలల పాటు పారించడం జరిగింది. మండలంలో ని మమ్మద్‌హుస్సేన్‌పల్లి, నిజాలపూర్, సంకలమద్ది, కొమిరెడ్డిపల్లి గ్రామాలలోని వాగు కాల్వల ద్వారా కృష్ణా జలాలను మళ్లించి ఆయా గ్రామాలలో ఉన్న చెరువులను నింపుకున్నారు. కొమిరెడ్డిపల్లి గ్రామంలో గత వర్షా కాలం కంటే యాసంగిలోనే ఎక్కువ మంది రైతులు వరి పంటను సాగు చేశారు. సాగునీళ్లు పుష్కలంగా లభించడంతో వరిధాన్యం ఆశించిన స్థాయి కంటే ప్రతి ఏకరాకు పది బస్తాలు ఎక్కువనే పండాయని రైతులు అనందపడుతున్నారు.

రోడ్ల నిండా వరి ధాన్యమే..
2006లో జాతీయ రహదారి విస్తరణ జరిగింది. ఆ సమయంలో గ్రామంలో ఇరువైపుల సర్వీస్‌రోడ్లు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి యేట పండిన పంటలు ఒక వైపు ఉన్న సగం రోడ్డుపై వరి ధాన్యం అరబెట్టుకుంటే సరిపోయేది. కానీ ఇప్పు డు రెండు వైపులు రోడ్ల నిండడంతో పాటు, గ్రామ సమీపంలోని పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన రోడ్డు సైతం పూర్తిండి వరి ధాన్యంతో నిండిపోయింది. గ్రామంలోని అన్ని రోడ్లపై కూడా వరిధాన్యం అరబెట్టడానికి సరిపోవడంతో లేదు. సాధరణంగా రైతులు రెండు ఇంచుల నుంచి మూడు ఇంచుల వరకు వడ్లు పోసి ఆరబెట్టుకుంటారు. కానీ ఇప్పుడు స్థలం లేక ఆరు ఇంచుల నుంచి 8 ఇంచుల వరకు వడ్లను ఆరబోయాల్సి వస్తుందని రైతులు చెప్పుకోస్తున్నారు. వరిధాన్యం ఆరబెట్టడానికి స్థలం కొరత ఉండడంతో ఒక వైపు ఇబ్బందులు పడడంతో పాటు, మరో వైపు ప్రతి రోజు ఉరుములు, మేరుపులతో వర్షం ఎప్పుడు వస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొంత మంది రైతులు ఆరబెట్టడానికి స్థలం లేకపోవడంతో కుప్పలుగా పోసి ఆరబెట్టుకుంటున్నారు. వరి కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని గ్రామ రైతులు కొరుతున్నారు. లేదంటే ఒక్క వర్షం వచ్చినా చెతికి వచ్చిన పంట వరద పాలువుతుందని రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...