బాలికల సాధికారతకు పునాది ఇంటర్


Tue,April 23, 2019 12:43 AM

వనపర్తి విద్యావిభాగం : ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారు, ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం, ఆ ప్రాంతం తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని అని ఆంగ్ల సామెత ఉంది. మహిళలు విద్యావం తులైతే తమ కాళ్లలపై తాను నిలబడినప్పుడే మహిళ సాధికారత అదంటత అదే లభిస్తుంది. మహిళ విద్యను ప్రోత్సహించేందు కోసం తెలంగాణ ప్రభుత్వం బాలికల విద్యకోసం ఎన్నో గురుకులాలను, హాస్టల్స్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా డ్రా ప్ అవుట్‌లను తగ్గించి బాలికలకు విద్యను అం ంచాలనే ప్రథమ కర్తవ్యంతో 2009 నుంచి కేజీబీవీలను ప్రారంభించారు. క్రమేణా ప్రతి మండల కేంద్రంలో కేజీబీవీలు ఏర్పాటు చేశారు. తదనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పటయ్యక పరిపాలన సౌలభ్యం కోసం నూతన మండలాలను ఏర్పాటు చేశారు. ఆ మండల కేంద్రాల్లో కూడా కేజీబీవీలను ప్రారంభించి బాలికలకు విద్యను అందిస్తున్నారు. అంచెలంచెలుగా తమ లక్ష్యాన్ని డ్రాప్ అవుట్ తగ్గించడం నుంచి అమ్మాయిలకు ఉన్నత విద్య లక్ష్యమే ధ్యేయంగా కేజీబీవీలు పనిచేస్తున్నాయి.

జిల్లా వ్యాప్తంగా కేజీబీవీలు ఇలా..
వలస పిల్లలను, కడు పేదరికంలో ఉండి చదువుకు దూరంగా ఉన్న వారిని, అనేక కారణాల చేత మధ్యలోనే చదువు మానిసే బడీ ఈడు పిల్లలను బడిలో చేర్పించేందుకు కోసం, డ్రాప్ అవుట్‌ను తగ్గించేందు కోసం కేజీబీవీలను 2009లో ప్రారంభమై పాత మండల కేంద్రాల్లోనే కేజీబీవీలను ప్రారంభించారు. నాటి నుంచి బాలికలకు విద్యను అందిస్తు అన్ని సౌకర్యాలు , ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు నాణ్యవంతమైన విద్యను అందిస్తున్నారు. గత ఏడాది బాలికల డ్రాప్ అవుట్‌తో పా టు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఉ మ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసి విద్యను అందించారు. ప్రతి మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీలోని బాలికలకు 10+2 విద్య ను అందించాలనే సదుద్దేశ్యంతో ఈ ఏడాది ఆక్టోబర్ మాసంలో జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు అప్‌గ్రేడేషన్ కోసం రాష్ట్ర డైరెక్టర్‌కు ప్రతిపాదనలు పంపగా ఆ ప్రతిపాదనలు ఆమోదిస్తు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి మండల కేంద్రంలో కేజీబీవీ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. పాఠశాలల విద్య పూర్తి చేసుకొని కళాశాల విద్యను ప్రభుత్వమే అందించేందుకు ముందుకు రావడతో పేద విద్యార్థినులకు వరంగా మారింది. కొంత నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, వలస వెళ్లే తల్లిదండ్రుల పిల్లలకు ఎలాంటి ఖర్చు లేకుండా పౌష్టికాహారంతో పాటు మెరుగైన విద్యను కొనసాగించడం ఆదృష్టంగా భావిస్తున్నారు. ఇప్పటికే వనపర్తిలోని 14 కేజీబీవీల్లో 6 నుంచి 10 వ తరగతి వరకు 2771 మంది బాలికలు విద్యను పొందుతున్నారు.

కోర్సులు ఇలా..
కళాశాలలో విద్యను అభ్యసించేందుకు గత ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వనపర్తిలో ఒకటి, గద్వాలలో 2, నాగర్‌కర్నూల్‌లో 5, మహబూబ్‌నగర్‌లో 5 చొప్పున ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రారంభించి అధ్యాపకులను నియమించి బోధన సాగిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఎంపీసీ, బైపీసీ కోర్సులతో పాటు సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ నర్సింగ్ కోర్సులను ఏర్పాటు చేసి బోధన చేయ్యనున్నారు. కళాశాల విద్యతో మరింత ఉన్న విద్యను అందుకునేందుకు పేద బాలికలకు ఇంటర్ విద్య పునాదిగా మారి అందరు ఆశిస్తున్నట్లు మహిళ సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అయితే రాష్ట్ర ఎస్‌పీడీ ఆదేశిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీబీవీలో ఇంటర్ విద్యను ప్రారంభిస్తామని, జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కేజీబీవీలలోనే నిర్వహిస్తాం. అన్ని వసతులతో ఇంటర్ విద్య అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

ఆత్మరక్షణకు కరాటే..
వనపర్తి క్రీడలు : నేటి సమాజంలో చదువు, ఉద్యోగ, ఉపాధి రీత్యా మహిళలు గడప దాటాల్సి వస్తున్నది. కానీ ఇంటి నుంచి వెళ్లిన బాలికలు, యువతులు తిరిగి వచ్చేదాకా వారి తల్లిదండ్రులకు కంటి మీద కునుకుండదు. ప్రేమ పేరిట పోకిరీల ఆగడాలు శుృతిమించుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సహోద్యోగుల నుంచి సైతం లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని స్వీయరక్షణ కోసం బాలికలకు కరాటే నేర్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన 15 పాఠశాలల్లో కరాటే శిక్షణ అందిస్తుంది.

మూడు నెలల పాటు..
వనపర్తి జిల్లా ఆయా మండలాల్లో ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్, కేజీబీవీ పాఠశాలలను కరాటే శిక్షణ కోసం ఎంపిక చేశారు. ఇక్కడ తొమ్మి ది, పదో తరగతి చదువుతున్న విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్‌లో తర్ఫీదు ఇస్తున్నారు. ప్రతి రోజూ గంట చొప్పున మూడు నెలల పాటు కొనసాగుతున్న ఈ శిక్షణ కోసం అవసరమైన నిధులను రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా ఆ యా పాఠశాలల యాజమాన్య కమిటీల ఖాతాల్లో వేశారు. ఈ నిధులతో శిక్షకులను నియమించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన దుస్తులు ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేస్తున్నారు.

స్వీయ రక్షణే లక్ష్యంగా..
స్వీయరక్షణే లక్ష్యంగా విద్యార్థినులకు కరాటే శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థినిలను ఆకతాయిలు, దుండగులు, ఆటకాయిస్తే ఎలా స్పందించాలి, చేయి వేస్తే ఎలా ఎదుర్కోవాలి, తదితర అంశాలను ప్రధానంగా నేర్పిస్తున్నారు. ఈ శిక్షణ అనంతరం కరాటేలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు కూడా నిర్వహిస్తారని తెలుస్తున్నది. అందులో భాగంగా కేతపల్లి మండలం తెల్లరాళ్లపల్లి తండాకు చెందిన స్వప్న వివిధ స్థాయిలో పతకాలను సాధించినందుకు జిల్లా కలెక్టర్ శ్వేతామొహంతి చేతుల మీదుగా ప్రశాంసా పత్రాన్ని అందజేశారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...