నేటి నుంచి..నామినేషన్ల ఘట్టం


Mon,April 22, 2019 02:54 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : పరిషత్ ఎన్నికల పోలింగ్‌కు కేవలం పక్షం రోజులే మిగిలిం ది. ఈ లోపు నామినేషన్లు పరిశీలన.. ఉపసంహరణల అనంతరం పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లన్ని చెకా.. చెకా జరుగుతున్నాయి. జిల్లాలో మూ డు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నేటి సోమవారం 22 నుంచి నామినేషన్ల స్వీకరణతో మొదలై ఎన్నికలు మే 6 నుంచి 14 వరకు మూ డు విడతల్లో పోలింగ్ జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం అదే రోజు మే 27న స్థానిక సం స్థల ఓట్ల లెక్కింపు.. ఫలితాలను వెల్లడించేలా రా ష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. జిల్లాలో మొ త్తం 14 జిల్లా ప్రాదేశిక స్థానాలంటే.. 128 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశలో 4 మండలాలు, రెండో విడతలో 5, మూ డో విడతలో ఐదు మండలాల చొప్పున ఎన్నికల ను నిర్వహించేలా ఖరారైంది. జిల్లాలోని 14 మం డలాల్లో మొత్తం 3,42,450 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.

ఎన్నికలకు ఏర్పాట్లు
జిల్లాలో పరిషత్ ఎన్నికల ఏర్పాట్లపై అధికారు లు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఎన్నికలకు అవసరమై న సిబ్బందిని గుర్తించి శిక్షణలు కూడా ఇచ్చారు. జిల్లాలోని 14 మండలాల వారీగా అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల గ్రామ పంచాయతీ, ఎంపీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అధికారులు పరిషత్ పోరులోను ఎంపీటీసీ, జెడ్పీటీసీ ల ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు రోజుల కిందట పీవోలు, ఏపీవోలకు కలెక్టర్ శ్వేతామొహంతి శిక్షణను పూర్తి చేశారు. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుండటంతో ఆయా మండలాల్లోను ప్రత్యేక ఏర్పాట్లను పూర్తి చేశారు.

పకడ్బందీగా వ్యూహలు
పరిషత్ ఎన్నికలకు పకడ్బందీ వ్యూహన్ని వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలను కొలిక్కి తెచ్చింది. గతంలోనే ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు వెలువడినందు నా.. ఆయా కేటగిరిల వారీగా అభ్యర్థులను గుర్తిం చే పనులకు శ్రీకారం చుట్టింది. అయితే, పది రోజులుగా పరిషత్ ఎన్నికల వేడి గ్రామాలకు చేరింది. ఎంపీ ఎన్నికలు ముగిసిన అనంతరం పల్లెల్లో పరిషత్ ఎన్నికల కొలాహలం కొనసాగుతుంది. గడచిన వారం రోజుల్లో అభ్యర్థుల వేటపై చర్చలు మొదలయ్యాయి. ఇక ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్దగా అలికిడి కనిపించడం లేదు. మం త్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. పార్టీ గుర్తుల ద్వారా పరిషత్ ఎన్నికలు జరుగుతున్నందునా గ్రామాల్లో ఆసక్తి కనిపిస్తుంది.
మొదటి విడతలో..
జిల్లాలోని వనపర్తి, గోపాల్‌పేట, ఖిల్లాఘణపురం, రేవల్లి మండలాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మండలా ల్లో 40 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈనె ల 22 సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరణ మొద లై మే 6న పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లన్ని పూర్తి చేస్తున్నారు.
రెండో విడతలో..
అమరచింత, ఆత్మకూరు, మదనాపురం, కొత్తకోట, పెద్దమందడి మండలాల్లోని 43 ఎంపీటీసీ స్థానాలకు, 5 జెడ్పీటీసీ స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 26 నుంచి నామినేషన్లు స్వీకరణతో మొదలై మే 10 పోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
3వ విడతలో..
చిన్నంబాయి, వీపనగండ్ల, శ్రీరంగాపురం, పెబ్బేరు, పాన్‌గల్ మండలాల్లోని 45 ఎంపీటీసీ, 5 జెడ్పీటీసీ స్థానాలకు చివరి విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఏఫ్రిల్ 30న నామినేషన్ల స్వీకరణతో మొదలై మే 14 ఎన్నికలను నిర్వహిస్తారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...