నేడు కానిస్టేబుల్ మోడల్ పరీక్ష


Mon,April 22, 2019 02:52 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : వనపర్తి జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ రాత పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మంగళవా రం ఉదయం 9:30 గంటలకు పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఉచిత మోడల్ పరీక్షల గ్రాండ్ టెస్ట్ (మాదిరి పరీక్ష)ను నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఎస్పీ అపూర్వరావు తెలిపారు. ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని కానిస్టేబుల్ ఉద్యోగానికి సిద్ధమవుతున్న అభ్యర్థులు పోలీస్‌శాఖ తరఫున శాఖ ఏర్పాటు చేస్తున్న మాదిరి పరీక్షలు ఎంతోగానో ఉపయోగకరంగా ఉంటాయని ఎస్పీ తెలిపారు. కానిస్టేబుల్‌కు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈనెల 28వ తేదీన ప్రభుత్వం నిర్వహిస్తున్న చివరి రాత పరీక్షలో మానసికంగా ఎలాంటి ఒత్తిడికిలోను కాకుండా భయం వాడి ధైర్యంగా పరీక్షలు రాసి విజ యం సాధించేందుకే ఈ మాదిరి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9603124113, 7901153235, 9000862786 నెంబర్లను సంప్రదించాలని ఎస్పీ తెలిపారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...