నేటి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ


Mon,April 22, 2019 02:51 AM

-అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ
గోపాల్‌పేట : మండలంలో వచ్చే నెల 6న జరుగనున్న మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఈనెల 22న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఎంపీడీవో బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నేటి నుంచి ఈనెల 24వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. 25న నామినేషన్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. ఉమ్మడి మండలంలోని రెండు జెడ్పీటీసీ స్థానాలకు, 17 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజు చెల్లు బాటైన నామినేషన్ అభ్యర్థుల జాబిత విడుదల చేయనున్నట్లు 26న అప్పిళ్లకు చివరి తేదీ, 27న అప్పిళ్ల పరిష్కరణకు చివరి తేదీ ఉంటుందని తెలిపారు. 28న అభ్యర్థిత్వం ఉపసంవరణకు చివరి తేదీయని తెలిపారు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబిత ప్రచరించడం జరుగుతుందన్నారు. మే 27న ఓట్ల లెక్కింపు జరుగనున్నట్లు లెక్కింపు పూర్తి అయిన వెంటనే ఫలితా లు వెలువడనున్నట్లు ఆయన తెలిపారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...