ప్రిన్సిపల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి


Mon,April 22, 2019 02:51 AM

-కోచింగ్ సెంటర్ గుర్తింపును రద్దు చేయాలి
-ఆయా విద్యార్థి సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం
వనపర్తి, నమస్తే తెలంగాణ : సింధూజ కోచింగ్ సెంటర్ ప్రిన్సిపాల్‌పై క్రిమినల్ కేసును నమోదు చేయాలని, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను, హాస్టల్స్‌ను మూసివేయాలని పలు విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌చౌక్‌లో రుషి బంకెట్ హాల్‌లో పీడీఎస్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎంఎస్‌ఎఫ్, విద్యార్థి సంఘాల నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇటీవల జిల్లా పరిధిలోని నాగవరం గ్రామ శివారులో గల పీఎస్ సింధూజ పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి మద్యం మత్తులో విద్యార్థిని తీవ్రంగా కొట్టడంతో వంశీ అనే విద్యార్థి మరణించడం జరిగిందన్నారు. విద్యార్థులను మానసికంగా శారీరకంగా వేదించే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో పిడిఎస్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, యంఎస్‌ఎఫ్, విద్యార్థి సంఘాల నాయకులు సురేష్, ఆది, నరేష్, మాదిగ రాము, రాజుకుమార్ తదితరులు ఉన్నారు

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...