స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేద్దాం


Mon,April 22, 2019 02:51 AM

పెబ్బేరు టౌన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరుఫున ఏ అభ్యర్థికి టికెట్టు వచ్చిన అందరం కలిసికట్టుగా శ్రమించి పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి మండలం కార్యకర్తలకు స్థానిక సంస్థల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మండలంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నిలబడే అభ్యర్థుల పేర్లను అధిష్టానికి పంపడానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గౌని బుచ్చారెడ్డి మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నిలబడే అభ్యర్థుల పేర్లను అధిష్టానికి పంపుతామని, అధిష్టానం మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తుందన్నారు. పార్టీకోసం పని చేస్తున్న వ్యక్తులను, సేవలను, పార్టీలోని సీనియర్టీని, అభ్యర్థీకి ప్రజల్లో ఉన్న సంసంబంధాలను, రాజకీయ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను అధిష్టానం ప్రకటిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కర్రెస్వామి, సింగిల్‌విండో అధ్యక్షుడు గౌని కోదండరామిరెడ్డి, నాయకులు ఆనంద్‌రాజ్, పృద్వీరాజ్, జగన్నాథం, పర్వతాలు, రాజశేఖర్, కురుమూర్తి, ఉమ్మడి మండల గ్రామాల ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...