గురుకుల ఇంటర్, డిగ్రీ ప్రవేశ పరీక్షలు ప్రశాంతం


Mon,April 22, 2019 02:50 AM

-పాలమూరు జిల్లా కేంద్రంలో 39 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
-ఇంటర్ పరీక్షకు 7034, డిగ్రీ పరీక్షకు 1164 మంది హాజరు
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాల కోసం ఆదివారం విద్యార్థులకు నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మొత్తం 39 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అర్హత పరీక్ష నిర్వహించారు. ఇంటర్ ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 7858 మంది విద్యార్థు లు హాజరు కావాల్సి ఉండగా, 7034 మంది పరీక్ష రాయగా, 824 మంది పరీక్షకు గైర్హాజరాయ్యరు. డిగ్రీలో ప్రవేశానికి సంబంధించి 1410 మంది వి ద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 1164 మంది విద్యార్థులు పరీక్ష రాశా రు. 246 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ గురుకుల పాఠశాలలు 19 ఉండగా, డిగ్రీ గురుకుల కళాశాల ఒకటి మాత్రమే ఉందని, ఆయా కళాశాలల్లో ప్రవేశం కోసం విద్యార్థులకు అర్హత పరీక్ష నిర్వహించినట్లు బీసీ గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ లింగయ్య తెలిపారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...