అన్ని స్థానాల్లో విజయం సాధించాలి


Mon,April 22, 2019 02:50 AM

-మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్, నమస్తే తెలంగాణ : మక్తల్ నియోజకవర్గంలోని అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మక్తల్‌లోని తన నివాసగృహంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలో మొత్తం 69 ఎంపీటీసీ స్థానాలు, 7 జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయ దుందుబి మోగించాలని కార్యకర్తలకు సూచించారు. అన్ని ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత వెంకట్రాంరెడ్డి తదితరులు ఉన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...