స్వర్ణమ్మ గెలుపునకు కృషి చేయాలి


Mon,April 22, 2019 02:50 AM

-మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా స్వర్ణమ్మకు అవకాశం
-భూత్పూర్ జెడ్పీటీసీగా భారీ మెజార్టీతో గెలిపించాలి
-దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
భూత్పూర్ : భూత్పూర్ మండల టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్‌రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. ఆదివారం అన్నాసాగర్‌లోని తన స్వగృహంలో భూత్పూర్ మండల టీఆర్‌ఎస్ నాయకులతో ఎమ్మెల్యే ఆల సమావేశమై మాట్లాడారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అబిప్రాయాల మేరకు స్వర్ణసుధాకర్‌రెడ్డిని జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ అధిష్ఠానం నిర్ణయించిందని తెలిపారు. చిన్నచింతకుంట మండలానికి చెందిన స్వర్ణసుధాకర్‌రెడ్డికి అక్కడ రిజర్వేషన్ అనుకూలంగా లేకపోవడం వల్ల భూత్పూర్ మండలం నుంచి పో టీ చేస్తుందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు.

పార్టీ అదిష్ఠానం సూచన మేరకు స్వర్ణ సుధాకర్‌రెడ్డిని భూత్పూర్ మండలం నుంచి పోటీ చేస్తుందని, ఆమె గెలుపును పార్టీ కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. దేవరకద్ర నియోజకవర్గానికి జిల్లా పరిషత్ చైర్మన్‌ను కేటాయించడంపై ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్‌కు భూత్పూర్ మండల టీఆర్‌ఎస్ నాయకులపై ఎంతో నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా చూసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, జిల్లా మత్స్య సహకార సంఘం జిల్లా అ ధ్యక్షుడు మనెమోని సత్యనారాయణ, జెడ్పీటీసీ రాచూరి చంద్రమౌళి, వైస్ ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ నర్సింహాగౌడ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సాయి లు, గోప్లాపూర్ సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, అశోక్ తదితరులు ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...