కళ తప్పిన కళాతోరణం


Sun,April 21, 2019 12:38 AM

- 780 గజాల్లో లలిత కళాతోరణ నిర్మాణం
- రూ.28 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు
- 2007లో మున్సిపాలిటీకి అప్పగింత
- వసతులు సమకూర్చడంలో వైఫల్యం
- పార్కింగ్ స్థలంలో యథేచ్ఛగా డబ్బాల ఏర్పాటు
- పట్టించుకోని మున్సిపల్ అధికారులు
- అధికారుల నిర్లక్ష్యపు నీడకు ఇదో నిదర్శనం

వనపర్తి, నమస్తే తెలంగాణ : వనపర్తి సంస్థా నం అంటేనే కవులు, కళాకారులకు పెట్టిన పేరు. ఆనాటి నుంచి నేటి వరకు ఎంతో మంది కవులను ప్రపంచానికి అందించిన ఘనత వనపర్తి నియోజకవర్గానికి ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన నాయకులు వనపర్తి పట్టణ నడిబొడ్డులో కళాకారుల కో సం ఒక కళావేదికను ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో రూ.28 లక్షల ఎంపీ నిధులతో లింగిరెడ్డి కుంట సర్వే నెంబర్‌లోని 780 గజాలలో లలిత కళాతోరణాన్ని నిర్మించారు. దీనిని 2007లో ఆ దాయ పెరుగుదల కోసం మున్సిపాలిటీకి అప్పగించారు. కొద్ది కాలం పట్టించుకున్నా.. వసతులు స మకూర్చడంలో మున్సిపాలిటీ అధికారులు వి ఫలం కావడంతో కార్యక్రమాల నిర్వహణకు ఎవ్వ రూ ముందుకు రాకపోవడంతో అది కాస్త కళావిహీనంగా మారింది.

పార్కింగ్ స్థలంలో వెలిసిన డబ్బాలు..
కళాతోరణానికి వచ్చే కళాకారులు, ప్రేక్షకుల వాహనాల పార్కింగ్ కోసం ఎల్ ఆకారంలో 10*100 గజాల స్థలాన్ని కేటాయించారు. అది కాస్త మున్సిపల్ అధికారుల కాసుల కక్కుర్తికి ప రుల చేతిలోకి చేరి కబ్జాకు గురైంది. పార్కింగ్ స్థ లంలో యథేచ్ఛగా డబ్బాలు వెలిశాయి. ఆ స్థలం మున్సిపల్ ప్రజాప్రతినిధుల చేతిలోకి వెళ్లినట్లు కొంత మంది అధికారులు, ప్రజలు చెప్పలేక చెబుతున్నారు. వారు ప్రతి నెలా చిరు వ్యాపారులతో లోపాయికారి ఒప్పందం చేసుకుని కిరాయిని అం దినకాడికి దండుకుంటున్నారు. ఇదంతా మున్సిపల్ అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని స్థితి లో ఉండడం విశేషం.

లక్షలు వెచ్చించారు.. లక్ష్యం మరిచారు..
మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాల్లో కళాతోరణం ఒకటి. ఇంతటి ఆదాయం వచ్చే కళాతోరణాన్ని అభివృద్ధి పర్చాల్సిన అవసరం ఉన్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టారు. కళాతోరణానికి వసతులు కల్పించి మెరుగుపరచేలా ము న్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు, కవులు, కళాకారులు పలుమార్లు విన్నవించుకున్నా పెడ చెవిన పెట్టారు. 2 నుంచి 3 గంటల పాటు ఒక్క కార్యక్రమం నిర్వహిస్తే అన్ని ఖర్చులు పోగా రూ.1000 చొప్పున ఆదాయం సమకూరుతున్నా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...