ఘనంగా వేణుగోపాలస్వామి బ్రహోత్సవాలు


Sun,April 21, 2019 12:36 AM

- కేశంపేటలో కనుల పండువగా రథోత్సవం
- రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా..
- తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుందాం
- హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

గోపాల్‌పేట : రేవల్లి మండలంలోని కేశంపేట గ్రామంలో వేణుగోపాలస్వామి బ్రహోత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తేరు ఉత్సవాన్ని చూ సేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కోలాటాలు, బొడ్డెమ్మలు, భజనలతో తేరు లాగారు. కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలకగా, ఆలయ సిబ్బంది శాలువాతో సన్మానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చే సిన మంత్రి రథోత్సవాన్ని లాగారు. జాతర వద్ద వెలిసిన మిఠాయి దుకాణాల వారితో కాసేపు ము చ్చటించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని కోరారు. పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ జాన కి రాంరెడ్డి, సర్పంచ్ గోపాల్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ రఘురామారావు, మాజీ సర్పంచులు రాం కిషన్‌రావు, యశోద, ఎం పీటీసీ రఘు యాదవ్, టీఆర్‌ఎస్ ఉమ్మడి మం డల కన్వీనర్ కొత్త రామారావు, నర్సింహరావు, పర్వతాలు, రవీందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, యాదగిరి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...