నేడే పరిషత్ పోరుకు.. మోగనున్న సైరన్


Sat,April 20, 2019 12:28 AM

మహబూబ్ నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : పరిషత్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం శనివా రం విడుదల చేయనుంది. ఎన్నికల నిర్వహణకు సం బంధించిన ప్రక్రియ, ఏర్పాట్లు దాదాపుగా అన్నీ పూర్తై న నేపథ్యంలో షెడ్యూల్ జారీకి ఎన్నికల సంఘం సిద్ధమైంది. తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో స్థానిక పోరు ప్రారంభం కాను ంది. 22 నుంచి తొలి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లను స్వీకరించేందుకు రంగం సిద్ధం చేశారు. తొలి విడత ఎన్నికలు మే 6న జరుగనున్నా యి. ఉమ్మడి జిల్లా పరిధిలో మహబూబ్‌నగర్, నారాయణపేటలో రెండు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నాగర్‌కర్నూలు, వనపర్తి, జోగుళాంబ గద్వాలలో 3 విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. పరిషత్ పోరుకు అధికార యంత్రాగం సిద్ధమవుతుండగా... రాజకీయ పార్టీలు సైతం గెలుపు గుర్రాలను వెతికేందుకు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ పోరులో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ పార్టీ.. ప్రాదేశికంపైనా గురి పెడుతోంది.

నేడే తొలి విడత షెడ్యూల్..
రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం నేడు విడుదల చేయనుంది. నోటిఫికేషన్ ఈనెల 22న వెలువడనుంది. అదే రోజు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 24వరకు ఉంటుంది. ఉపసంహరణలకు చివరి తేదీ ఈనె ల 28. పోలింగ్ వచ్చే నెల 6న జరుగుతుంది. రెండో విడత నోటిఫికేషన్ ఈ నెల 26న విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణ అదే రోజు ప్రారంభమవుతుంది. నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 28. ఉపసంహరణల కు మే 2 చివరి తేది. పోలింగ్ మే 10న జరుగుతుంది. మూడో విడత నోటిఫికేషన్ ఏప్రిల్ 30న విడుదల అవుతుం ది. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్లకు చివరి గడువు మే 2. నామినేషన్ల ఉపసంహణ మే 6తో పూర్తవుతుంది. పోలింగ్ మే 14న జరుగుతుంది.

యంత్రాంగం సన్నద్ధం..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అధికార యంత్రా ంగం సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆర్వో, ఏఆర్వోలకు తొలి దశ శిక్షణ సైతం ముగిసింది. బ్యాలెట్‌తో ఎన్నికలు జరుగుతున్నందున సిబ్బంది ఎంతో అప్రమత్తం గా ఉండాలని అధికారులు శిక్షణ సందర్భంగా వివరించారు. నామినేషన్లు తీసుకునే విధానం, పరిశీలన, ఉపసంహరణ, అభ్యంతరాల స్వీకరణ, తిరస్కరణకు సంబంధించిన అంశాలతో పాటు నోటీస్ బోర్డుపై రోజువారీ నామినేషన్ల డిస్‌ప్లే చేయాల్సిన విషయాలపై శిక్షణ కొనసాగింది. ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు తదితర అంశాలపైనా శిక్షణలో స్పష్టంగా వివరించారు. ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసేందుకు యంత్రాంగాన్ని అన్ని విధాలా సిద్ధం చేశారు. ఎన్నికల సందర్భంగా పటిష్టమైన బం దోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

ప్రాదేశికంపై గులాబీ గురి..
అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. మరోవైపు ఇటీవల ముగిసిన ఎంపీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే జెడ్పీ, ఎంపీ స్థానాలనన్నింటినీ కూ డా కైవసం చేసుకునేలా పార్టీని సన్నద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీల్లో టీఆర్‌ఎస్ గెలుపు బావుటా ఎగురవేయాలని పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి పాలమూరు పరిధిలో ఉన్న 5 జెడ్పీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులే కైవసం చేసుకునాలని పార్టీ సిద్ధమవుతోంది. జెడ్పీటీసీ, ఎంపీపీలను కైవసం చేసుకునే బాధ్యత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు అప్పగించేందుకు రంగం సిద్ధం అవుతోంది. మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రాదేశిక పోరుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలతో ఎన్నికలపై సమాలోచన చేపట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహంతో రాష్ట్రంలో అత్భుతమైన ఫలితాలు సాధించారు. అదే వ్యూహాలను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అనుసరించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...