పాసు బుక్కులు అందక పరేషాన్


Sat,April 20, 2019 12:27 AM

ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని నిడుగుర్తికి చెందిన పలువురు రైతులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన కొత్త పట్టా పాసు బుక్కులు అందక ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి చెందిన 20మందికి పైగా రైతులు తమకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూములకు కొత్త పటా ్టపాసు బుక్‌లను అందించాలని నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేసినా తమ మొరను ఆలకించే వారు లేరని వాపోతున్నారు. గ్రామానికి చెందిన మల్‌రెడ్డి, గాండ్ల వినోద్, ఖాదర్‌ఖాన్, జుబేదాబేగం, అమీర్‌ఖాన్, చాంద్‌పాషా, మహబూబ్‌పాషా, అహ్మద్ ఆరిఫ్, అమీనాబీ, ఎండీ ఖాజామైద్దీన్, ఎండీ కుత్బుద్దీన్, బాపురం గ్రామానికి చెందిన పిల్లికండ్ల శివప్పలతో పాటు మరి కొంత మంది రైతులకు నిడుగుర్తి గ్రామ శివారులో నంబర్ 486, 611, 609, 612, 613, 614, 633, 634, 655 సర్వే నంబర్లలో వ్యవసాయ భూములు ఉన్నాయి. పట్టా భూములను కొందరు రైతులు యాభై ఏళ్లకు పైగా వారసత్వంగా పట్టాదారు పేరు మార్పిడి చేసుకున్నారు. మరి కొందరు స్థానిక రైతుల వద్ద కొనుగోలు చేసి పట్టా సర్టిఫికెట్లు పొంది అనుభవిస్తున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన తర్వాత అధికారులు తమకు కొత్త పట్టాదారు పుస్తకాలు అందించలేదని.. దీంతో తాము ప్రభుత్వం అందిస్తోన్న రైతు బంధు పంట పెట్టుబడి సహాయం నిదులు అందుకోలేక పోయా మని, రైతు బీమా వర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు. తమకు పట్టా బుక్కులు అందజేయాలని ఏడాది కాలంగా తహసీల్దార్, వీఆర్‌వోల చుట్టూ తిరుగుతున్నామని.. రెవెన్యూ రికార్డుల్లో వక్ఫ్ భూమిగా నమోదైంది.. అందుకు తామేమి చేయలేమని, మీకోసం మా ఉద్యోగాలు పోగొట్టుకోవాలా అని అధికారులు నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో వ్యవసాయమే జీవనాధారమైన తమకు పట్టా బుక్కులు అందక పోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు చెబుతున్నారు.

నా పొలం తాతల కాలం నాటిది..
నిడుగుర్తి గ్రామ శివారులోని సర్వే నంబర్ 634.అ నందు నా పేరున 4.10 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. పొలాన్ని యాభై ఏళ్లకు పైగా మా తాత నుంచి మానాన్న, మా నాన్న నుంచి నేను వారసత్వంగా అనుభవిస్తున్నాను. కొన్నేళ్లుగా పొలం పైన బ్యాంకులో పంట పెట్టుబడి కోసం అప్పులు తీసుకున్నాను. అధికారులు కొత్తగా పట్టా పాసు బుక్కులు అందించడం లేదు. దీంతో రైతు బంధు సహాయం రెండు విడతలు కోల్పోవాల్సి వచ్చింది.
- మహబూబ్‌పాష, రైతు. నిడుగుర్తి.

ఆత్మహత్యే నాకు శరణ్యం..
నేను 30 ఏళ్ల కిందనే గ్రామానికి చెందిన షేక్‌మైనొద్దీన్ దగ్గర సర్వే నంబర్ 630లో 3. 36 ఎకరాల పొలం కొన్నాను. సేద్యం పైనే కుటుంబం మొత్తం ఆధారపడి బతుకుతున్నం. అప్పట్లో అప్పు సప్పు చేసి కొన్న పొలానికి పట్టా పుస్తకం ఇయ్యమని అడిగితే అదికారులు పట్టించుకోవడం లేదు. పొలం పోగొట్టు కుంటే నేను బతకడం దండగ. నాకు ఇంకెలాంటి ఆస్తి లేదు. ఆత్మహత్యే శరణ్యంగా భావించుకుంటాను. అధికారులు పట్టా పుస్తకం అందించి ఆదుకోవాలి.
- బి. మల్‌రెడ్డి, రైతు నిడుగుర్తి.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...