గెలిచే అభ్యర్థులకే స్థానిక ఎన్నికల్లో అవకాశం


Sat,April 20, 2019 12:26 AM

భూత్పూర్ : త్వరలో జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే అవకాశం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి అన్నాసాగర్ గ్రామంలో తన ఇంట్లో మూసాపేట, అడ్డాకుల మండలాలకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడతూ ఈ ఎన్నికలను ఆశామాషీగా తీసుకోకుండా అభ్యర్థులను చాల జాగ్రత్తగా ఎంపిక చేయాలని మండల నాయకులను కోరారు. మండల నాయకులు ఎంపిక చేసిన అనంతరం తాను పరిశీలించిన మీదట సీఎం కేసీఆర్‌కు పంపిస్తామని ఆయన తెలిపారు. ప్రతి అభ్యర్థిని ప్రజలతో ఉన్న సంబంధాలను అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీకి గెలిచే అభ్యర్థులే ముఖ్యమన్నారు. అభ్యర్థుల ఎంపికలో మండల నాయకులు ఆచితూచి ఆలోచించాలని పేర్కొన్నారు. ఎంపికైన తర్వాత తప్పని సరిగా గెలిపించాలని మండల నాయకులకు విజ్ఞప్తి చేశారు. పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రామన్‌గౌడ్, జెడ్పీ కో ఆప్షన్ మెహమూద్, మండలాధ్యక్షుడు నాగార్జునరెడ్డి, సర్పంచ్ శ్రీకాంత్, మాజీ ఎంపీపీ కృష్ణయ్య, తిరుతపయ్యయాదవ్, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...