భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి


Sat,April 20, 2019 12:26 AM

- వనపర్తిలో యువకుల భారీ ర్యాలీ
- రామలక్ష్మణ్ జానకి.. జై బోలో హనుమాన్‌కీ అంటూ నినాదాలు
- మార్మోగిన హనుమాన్ శోభాయాత్ర

వనపర్తి సాంస్కృతికం : హనుమాన్ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని చింతల హనుమాన్ దేవాలయ విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో శోభాయాత్రను పట్టణంలో భారీ ర్యాలీతో తీశారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై సీతారామలక్ష్మన్‌లను, హనుమంతుడు, శివాజీ, వివేకానందుడిని పూలమాలలతో అలంకరించి గాంధీచౌక్, శంకర్‌గంజీ, రాజీవ్‌చౌక్, న్యూబస్టాండ్, కలెక్టర్ కార్యాయలం, రామాలయం వరకు ఊరేగించారు. హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమై ప్రధానవీధుల వెంబడి యువకులు నృతాలను చేస్తూ కొనసాగించారు. ఈ సందర్భంగా హిందూవాహిని రాష్ట్ర అధ్యక్షుడు హరిచంద్ర రావు సీతారామలక్ష్మణ్, హనుమంతుల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు శ్రీనివాసులు, శివ, రాము, శివాజి, కుమార్, వెంకటేష్, రవి, యువకులు పాల్గొన్నారు.

జిల్లా టాపర్‌కు టీఆర్‌ఎస్ నాయకుల సత్కారం
కొత్తకోట రూరల్ : ఇంటర్మీడియట్ బైపీసీ మొదటి సంవత్సరంలో ఉమ్మడి జిల్లా మొదటి ర్యాంకు సాధించిన అయేషా ముబీనాను శుక్రవారం టీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా సత్కరించారు. కొత్తకోటకు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు రజియోద్దీన్ కూతురు అయేషా కొత్తకోట లోని నివేదిత జూనియర్ కళాశాలలో బైపీసీ ఫస్టియర్ చదువుతున్నది. గురువారం విడుదలైన ఫలితాలలో 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి ఉమ్మడి పాలమూరు జిల్లా టాపర్‌గా నిలిచింది. విషయం తెలుసుకున్న ఎమ్యెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఫోన్లో అ యేషాను అభినందించారు. అదే విధంగా మా జీ సర్పంచ్ చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకులు అయేషాను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు బాలకృష్ణ, స త్యం యాదవ్, మొద్దుబాబు, యాదయ్య, వెం కటేష్, భాస్కర్, రవి, శ్రీను, లతీఫ్, మజీద్, రాములు, వెంకటేష్ తదితరులు ఉన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...