ఘనంగా హనుమాన్ మాలధారణ


Sat,April 20, 2019 12:26 AM

- హాజరైన వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి వైద్యం : జిల్లా కేంద్రంలోని చిట్యాల రోడ్డు పక్కన ఉన్న చింతల హనుమాన్ దేవాలయంలో పలువురు స్వాములు హనుమాన్ మాలధారణ స్వీకరించారు. శుక్రవారం చింతల హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. హనుమాన్ ద్విగ్విజయోత్సవం రోజున భక్తులు మండల దీక్షను చేపట్టి 41 రోజుల తరువాత మాలవిరమణ చేసుకుంటారన్నారు. స్వాములకు మానసిక ఒత్తిడి, శారీరక వ్యాధులు వంటివి రాకుండా ఉంటాయన్నారు. ముందుగా గురు స్వామి శంకర్ 70 మందికి మాలధారణ ధరించినట్లు తెలిపారు. మాలధారణ చేసిన వారిలో సురేష్, విజయ్‌కుమార్, రఘు, రాము తదితరులు ఉన్నారు. మంత్రి వెంట టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...