ఘనంగా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు


Sat,April 20, 2019 12:26 AM

- అట్టహాసంగా ప్రారంభమైన బండలాగుడు పోటీలు
- హాజరైన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : మండలంలోని ఆరెపల్లి గ్రామంలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాటు చేసిన పాలపం డ్ల బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారం భించారు. రెండ్రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు గ్రామం నుంచి వలస వెళ్లిన వారు సైతం గ్రా మానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. బండలాగుడు పోటీల్లో వి జేతలకు రూ.25వేల బహుమతి ఉండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎద్దుల జతలు పోటీల్లో పాల్గొన్నాయి. మొక్కులో భాగంగా గ్రామానికి చెందిన డాక్టర్ శంకర్‌రెడ్డి 32 తు లాల వెండి పాదుకలను సమర్పించారు. సర్పంచ్ అనసూయ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, పీఏసీఎస్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, నాయకులు రవి కుమార్‌యాదవ్, అనిల్‌గౌడ్, సిరాజ్‌అహ్మద్, విజయ్‌భాస్కర్, వెంకట్‌రెడ్డి, రమేష్, ఉపస ర్పంచ్ తిరుపతయ్య, దేవాలయ కమిటీ ప్రతినిధులు, కార్యదర్శి నరేష్ తదితరులున్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...