మనమే టాప్


Fri,April 19, 2019 03:27 AM

వనపర్తి విద్యావిభాగం : రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వనపర్తి మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా జనరల్ విభాగంలో 7వ స్థానం, ఒకేషనల్ విభాగంలో 4వ స్థానంలో నిలిచింది. మహబూబ్‌నగర్ 60, నాగర్‌కర్నూల్ 52, జోగుళాంబ గద్వాలలో 55 శాతం ఫలితాలను సాధించగా, వనపర్తి జిల్లా 65 శాతం ఫలితాలు సాధించారు. ఒకేషనల్ విభాగంలో కూడా తనదైన శైలిలో ప్రతిభను చాటింది. నాగర్‌కర్నూల్ 63 శాతం రాగా, మహబూబ్‌నగర్ 68 శాతం, జోగుళాంబ గద్వా ల 56 శాతం కాగా, వనపర్తి 82 శాతం సాధించింది. గతేడాదితో పోలిస్తే ఒకేషనల్ విభాగంలో 4 శాతం తక్కువ ఫలితాలను సాధించింది. వనపర్తి జిల్లా లో ఫస్టియర్ జనరల్ విభాగంలో 3,031 మంది బాలురకు గాను 1,588 మంది పాస్ కాగా 52 శాతం, బాలికల విభాగంలో 3,304 మందికి గాను 1,945 మంది విద్యార్థులు పాస్ కాగా 59 శాతం ఫలితాలను సాధించారు. మొత్తం 6,335 మంది విద్యార్థులకు గాను 3,533 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 56 శాతం ఫలితాలను సాధించారు. ఒకేషనల్ విభాగంలో 399 మంది బాలురకు 203 మంది ఉత్తీర్ణత సాధించి 51 శాతం, బాలికల విభాగంలో 353 మందికి గాను 248 మంది ఉత్తీర్ణత సాధించగా 70 శాతం ఫలితాలను సాధించారు. మొత్తం 752 మంది విద్యార్థులకు గాను 451 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 60 శాతం ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలుర విభాగంలో 2,696 మందికి గాను 1,677 మంది విద్యార్థులు పాస్ కాగా 62 శాతం, బాలికల విభాగంలో 3101 మందికి గాను 2139 మంది విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించి 68 శాతం ఫలితాలను సాధించారు. మొత్తం బాలురు, బాలికలు 5,797కు గాను 3,816 మంది ఉత్తీర్ణత సాధించి జిల్లా వ్యాప్తంగా 65 శాతం ఫలితాలను సాధించడంతో రాష్ట్రస్థాయిలో ఏడో స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విభాగంలో మొత్తం 545 మందికి గాను 446 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 82 శాతం ఫలితాలు సాధించడంతో వనపర్తి జిల్లా రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. అందులో 276 మంది బాలురకు గాను 217 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 79 శాతం, బాలికల విభాగంలో 269 మంది విద్యార్థులకు గాను 229 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 85 శాతాన్ని సాధించారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో వనపర్తి మొదటి స్థానం నిలవడం పట్ల ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌ను, అధ్యాపకులకు జిల్లా విద్యాధికారి సింహయ్య అభినందనలు తెలిపారు. గతేడాది కంటే 3 శాతం ఎక్కువ ఫలితాలను సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఇంటర్ ఫలితాలలో జిల్లా టాపర్లు వీరే
గురువారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటి జిల్లా, రాష్ట్రస్థాయిలో ముందు వరుసలో నిలిచారు. టాపర్లు అందరూ సామాన్య, మధ్యతరగతి నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారు. జిల్లాలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో సీ.వీ.రామన్ కళాశాల విద్యార్థులు ఎం.వినయ్‌కు 1000 మార్కులకు గాను 986 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా, వంశీకృష్ణ, శ్రీకాంత్‌లు 984, జాగృతి కళాశాలకు చెందిన శివలీల 984 మార్కులు సాధించి రాష్ట్ర 5వ ర్యాంకులో, జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచారు. బైపీసీ విభాగంలో స్కా లర్స్ కళాశాలకు చెందిన వెన్నెల, షేక్ ఇర్ఫాన్‌లు 980 మార్కులతో జిల్లా టాపర్లుగా నిలిచారు. వాగ్దేవి కళాశాలకు చెందిన నవీన్‌నాయక్ 983 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచాడు. సీఈసీ విభాగంలో 950 మార్కులతో వాగ్దేవి కళాశాలకు చెందిన భువనేశ్వరి జిల్లా టాపర్లుగా నిలువగా సీ.వీ.రామన్ కళాశాలకు చెందిన మహే ష్ 947 మార్కులతో ద్వితీయ స్థానం, జాగృతి కళాశాలకు చెందిన ఎం.శివ 929 మార్కులతో తృతీయ స్థానం నిలిచారు. ఎంఈసీ విభాగంలో సీ.వీ.రామన్ కళాశాలకు చెందిన అనూష 980 మార్కులతో ప్రథమ స్థానం, జాగృతి కళాశాలకు చెందిన హరిక 977 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు.

ప్రథమ సంవత్సరం ఫలితాలలో..
జాగృతి కళాశాలకు చెందిన ఎస్.నిఖిత 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు, జిల్లాస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. రాహుస్ కళాశాలకు చెందిన నవీన్‌కుమార్, అరుణలు 461 మార్కులు సాధించిన ద్వితీయ స్థానంలో నిలవగా సీ.వీ.రామన్‌కు కళాశాలకు చెందిన భానుప్రకాష్, వినయ్, రాజశేఖర్‌లు 460 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. బైపీసీ విభాగంలో జాగృతి కళాశాలకు చెందిన నందిని 432 మార్కులు సాధించి రాష్ట్రంలో 5వ ర్యాంకు, జిల్లా మొదటి ర్యాంకు, స్కాలర్స్ కళాశాలకు చెందిన ఆస్మా 431 మార్కులు సాధించి జిల్లా ద్వితీయ ర్యాంకర్‌గా, సీ.వీ.రామన్ కళాశాలకు చెందిన చిన్న మల్లీ 426 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. ఎంఈసీ విభాగంలో సీ.వీ.రామన్ కళాశాలకు చెందిన మనోజ్ 484 మార్కులతో ప్రథమ స్థానం నిలివగా, సీ.వీ.రామన్ కళాశాలకు చెందిన రాజేష్ 493 మార్కులు సాధించి, రాహుస్ కళాశాలకు చెందిన పూజిత 483 మార్కులు సాధించి ద్వితీయస్థానంలో నిలవగా, జాగృతి కళాశాలకు చెందిన తిరుపతి 481 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచాడు. సీఈసీ విభాగంలో రాహుస్ కళాశాలకు చెందిన రోజ్‌మేరి, బీమేష్‌లు 479 మార్కులతో ప్రథమ స్థానం నిలిచారు. సీ.వీ.రామన్ కళాశాలకు చెందిన గణేష్ నాయక్ 475 మార్కులు సాధించి ద్వితీయ స్థానం, జాగృతి కళాశాలకు చెందిన శివశంకర్ 471 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు.

ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రతిభ
గోపాల్‌పేట : 2019 మార్చిలో నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు గురువారం వెల్లడించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులు ద్వితీయ సంత్సరానికి చెందిన విద్యార్థులు పి.మౌనిక(ఎంపీసీ)-1000 మార్కులకు 910 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. ఐశ్వర్య(బైపీసీ)-904 మార్కులు, శివకుమార్(బైపీసీ)-897, జె.మహేశ్వరీ(సీఈసీ)-894, పి.జ్యోతి(బైపీసీ)-881, కె.మనీష(సీఈసీ)-863 మార్కులు సాధించగా, ప్రథమ సంవత్సరంలో జి.శిరీష(బైపీసీ)లో 440 మార్కులకు 408 మార్కులు, సి.శివప్రసాద్-382 మార్కులు సాధించారు. అఖిల(ఎంపీసీ)470 మార్కులకు 405 మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్ తెలిపారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...