పది నెలలు తిరిగినా పట్టా మారలే..


Fri,April 19, 2019 03:26 AM

లింగాల : భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ఓ రై తుకు చెందిన భూమిని అధికారులు అన్నదమ్ముల పేరిట పట్టా చేశారు. దీంతో దిగాలు చెందిన రైతు తనకు ఇంక పొలం రాదనే ఇటీవల చనిపోయాడు. చివరకు రైతుబం ధు, రైతు బీమా కూడా అందకపోవడంతో గు రువారం సదరు రైతు కుటుంబం మృతిడి ఫొటోతో రాస్తారోకో చేసి న సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబట్‌పల్లిలో చోటుచేసుకుంది. అం బట్‌పల్లికి చెందిన గుంటి వెంకటయ్య అనే రైతు పట్టా భూమి సర్వేనంబరు 330లో 3-37 ఎకరాలు ఉంది. అయితే భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల వెంకట య్య తోబుట్టులైన నిర్మలయ్య, బంగారయ్య, లక్ష్మయ్య, నిరంజన్ నలుగురి పేరిట అమలు చేయగా వారికి పట్టాదారు పాసుపుస్తకాలతో పాటు రైతుబంధు సాయం కూ డా అందింది. కాగా ఈ విషయం తెలుసుకున్న వెంకట య్య అధికారుల తప్పిదాలను ఏకరువు పెట్టారు. 2018 జూన్ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తూ వచ్చారు. 10నెలలు దాటినా వీఆర్‌వో కాశన్న నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే రైతుపేరిట పట్టారాలేదు. రైతుబంధు సాయం కూడా అందలేదు. ఇంక ఎప్పటికీ తన పొలం రాదనే బెంగతో ఈ నెల 8న రైతు వెంకటయ్య చనిపోయాడు. ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రవేశపెట్టిన రైతు బీమా, రైతుబంధు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోలేకపోయింది.

తన అన్న పేరిట ఉన్న భూమి తమ పేరిట మార్పు చే యడం తప్పేనని అట్టి భూమిని అన్న కుమారుల ము గ్గురి పేరిట మార్పు చే యాలని తోబట్టువులు దరఖాస్తు పెట్టుకున్నా నిర్లక్ష్యం గా వ్యవహరించడంతో మృతుని కు టుంబం పిల్లాపాపలతో కలిసి గురువారం రోడ్డెక్కారు. లింగాల తహసీల్దా ర్ కార్యాలయం ఎదుట వెంకటయ్య భార్య చంద్రమ్మ తన భర్త ఫొటోతో కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్ శరబందు వివరణ ఇస్తూ వీఆర్‌వో నిర్లక్ష్యం జరిగిందని, చనిపోయిన రైతు వెంకటయ్య ముగ్గురు కుమారుల పేరిట అట్టి భూమిని మార్పు చేస్తామని చెప్పారు.

ఐదేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోలేదు..
నేను 40 ఎళ్ల కింద మా గ్రామనికి చెందిన చంద్రమ్మ, సాయమ్మ, భగవంతు గార్లతో సర్వే నెంబర్ 90, 100 లో మూడు ఏకరాల భూమిని కోన్నాను. 40 ఎళ్లుగా కాస్తూ చేస్తున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ సాదాబైనామాలు ఉంటే పట్టాలు ఇవ్వాలని చెప్పడంతో రెవెన్యూ అధికారులకు ధరఖస్తూ చెసుకున్నా. కానీ ఇప్పటి వరకు నా భూమి పట్టా ఇవ్వలేదు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పాసుబుక్కు ఇవ్వకపోవడంతో రైతుబంధు సహాయం అందకపోవడమే కాకుండా రైతు బీమాకు సైతం దరఖాస్తు చేసుకోలేక పోయాను. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టా, పాసు బుక్కులు ఇవ్వాలి.
- ధన్వాడ హన్మంతు, మరికల్ గ్రామం.

అవినీతి ప్రక్షాళన కావాలి..
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ప్రక్షాళన జరగాలి. అవినీతి వల్ల కలిగే అనర్ధాలను నమస్తే తెలంగాణలో వస్తున్న ధర్మగంటం శిర్షిక వెలుగులోకి తీసుకురావడం అభినందనీయం. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని కి వెళ్లినా డబ్బులు లేకుండా పనిచేయడం లేదు. ఇటువం టి అవినీతి అధికారులపై ధర్మగంట మోగించడం హర్షించదగ్గ విషయం.
- సీతారెడ్డి, రిటైర్డ్ ఎంపీహెచ్‌వో

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...