నేడు మోడల్ స్కూల్ ప్రవేశ అర్హత పరీక్ష


Thu,April 18, 2019 12:14 AM

- జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల ఏర్పాటు
- హాజరుకానున్న 2,400 మంది విద్యార్థులు
- రెండు విడతల్లో పరీక్ష నిర్వహణ

వనపర్తి విద్యావిభాగం : జిల్లాలో మోడల్ స్కూల్ ప్రవేశం కోసం గురువారం అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా పరీక్షల విభాగాధిపతి మధుకర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి లోపు మోడల్ స్కూల్‌లో ప్రవేశం కోసం పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 10 పరీక్షా కేంద్రాల్లో 2,400 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఒక్కో కేంద్రానికి 240 మంది చొప్పున విద్యార్థులను కేటాయించడం జరిగిందని, ఒక కార్యనిర్వహక అధికారి, ఒక డిపార్ట్‌మెంట్ అధికారితో పాటు 10 మంది ఇన్విజిలేటర్ల చొప్పున ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పరీక్ష రెండు విడతల్లో ఉంటుందని, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షకు హాజరుకావాలని కోరారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవన్నారు. జిల్లాలో బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, అనూస్ పాఠశాల, చాణిక్య ఉన్నత పాఠశాలలో రెండు కేంద్రాల చొప్పున, మదర్స్ ల్యాబ్, సరస్వతి శిశుమందిర్‌లు ఒక్కో కేంద్రం చొప్పున పరీక్ష కేంద్రాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న డీఈడీ ఫస్టియర్ పరీక్ష కేంద్రాన్ని మధుకర్ సందరించారు. మొత్తం 296 మంది విద్యార్థులకు గాను 275 మంది హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎం తారాబాయ్, యుగంధర్ తదితరులు ఉన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...