అన్ని వసతులూ కల్పిస్తాం


Thu,April 18, 2019 12:13 AM

- పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా చూస్తాం
- మద్యం, డబ్బు పంపిణీని అరికడతాం
- ఇన్‌చార్జి కలెక్టర్ వేణుగోపాల్
- జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై పార్టీల నేతలతో సమావేశం

వనపర్తి కలెక్టరేట్ : జెడ్పీటీసీ, ఎం పీటీసీ ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన కనీ స వసతులను ఏర్పాటు చేస్తామని ఇ న్‌చార్జి కలెక్టర్ డి.వేణుగోపాల్ తెలిపారు. బుధవారం ఆయన తన ఛాం బర్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మా ట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకు ని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద షా మియానా, తాగు నీరు, విద్యుత్ వం టి కనీస వసతులను తప్పనిసరిగా కల్పిస్తామని తెలిపా రు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మద్యం, డబ్బు సరఫరా వంటి వాటిని కట్టడి చేసేందుకు ఫ్లయింగ్ స్కాడ్లు, ఎస్‌ఎస్‌టీ బృందాల ద్వారా నిఘా ను మొదలుపెడతామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి కట్టుదిట్టంగా ఎన్నిక లు పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నా రు. పోలింగ్ కేంద్రాల ఆవరణలో మద్యం, నగదు పం పిణీ లాంటివి జరిగితే వాటిని తన దృష్టికి తీసుకురావాలని, తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉ ష్ణోగ్రతలు అధికంగా ఉన్నందున, వరుస ఎన్నికల నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మేలో కాకుండా జూన్, జూలై నెలల్లో నిర్వహించేలా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ పలు పార్టీల నాయకులు ఎం.డి.జబ్బార్, ఏ.బి.జె.సత్యం సాగర్, వేణుగోపాల్, సయ్యద్ జమీల్, రాజశేఖర్‌లు వేణుగోపాల్‌కు మెమోరాండం సమర్పించారు. సమావేశంలో ఆర్డీవో కార్యాలయ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట య్య, డిప్యూటీ సీఈవో నరసింహులు, జిల్లా పంచాయ తీ అధికారి రాజేశ్వరి హాజరయ్యారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...